మరోసారి అవకాశమివ్వండి

Apr 11,2024 20:41

ప్రజాశక్తి- బొబ్బిలి : బొబ్బిలి పురపాలక సంఘం సంఘం పరిధిలో గల గొల్లపల్లిలో 2వ రోజు గురువారం ఉదయం ఎమ్మెల్యే శంబంగి వెంకటచినప్పలనాయుడు సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి ఆ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం చేసిన మంచిని వివరిస్తూ రాబోయే ఎన్నికలలో తనకు మరోసారి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇప్పటికే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని మరోసారి అవకాశమిస్తే మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. టిడిపి,జనసేన నాయకులు మాటలు నమ్మి మోసపోవద్దని సంక్షేమం, అభివృద్ధి కేవలం వైసిపితోనే సాధ్యమని చెప్పారు.వేపాడ: మండలంలోని వావిలపాడు గ్రామంలో బుధవారం రాత్రి ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి డి. సత్యవంతుడు, జెడ్‌పిటిసి సేనాపతి అప్పలనాయుడు, వైసిపి మండల అధ్యక్షుడు జగన్నాథం, గ్రామ సర్పంచ్‌ బీల రాజేశ్వరి, గ్రామ కన్వీనర్‌ బి సతీష్‌, బి.నాయుడు, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఏను వెంకటరావు, సర్పంచులు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.చీపురుపల్లి: ఇంటింటికి వైసిపి పార్టీ ప్రచారం నిర్వహిస్తోంది. గురువారం స్థానిక జెడ్‌పిటిసి వలిరెడ్డి శిరీష, తోటి నాయకులు, కార్యకర్తలతో కలసి చీపురుపల్లి పట్టణంలోని ఐదవ సచివాలయం పరిధిలోని 138వ పోలింగ్‌ స్టేషన్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గత ఐదేళ్లు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేసిన సంక్షేమ అభివృధ్ది కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ జగన్‌మోహన్‌రెడ్డిని ఆశ్వీరదించాలని కోరారు. ఎమ్మెల్యేగా బొత్స సత్యన్నారాయణ, ఎంపిగా బెల్లాన చంద్రశేఖర్‌ పోటీ చేస్తున్నారని వారికి ప్రజలు ఓటు వేసి గెలిపించాలని శిరీష ప్రజలను అభ్యర్ధించారు. ఈ కార్యక్రమంలో వైసిపి జిల్లా కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, చీపురుపల్లి సర్పంచ్‌ మంగళగిరి సుధారాణి, బుంగ కనకేశ్వరరావు, మిరియాల కనకరత్నం, ఎల్‌ ప్రభాత్‌ కుమార్‌, చంద్రశేఖర్‌గుప్త, అడ్డూరి కృష్ణ, అశోక్‌, నారాయణశెట్టి సోమేష్‌, ఆశపు శ్రీను, బోనెల నాగేంద్ర, అడ్డేరి భారతి, బుంగ సంతోష్‌, నాసిక వెంటేష్‌, వినోద్‌, కెయ రాంబాయి తదితరులు పాల్గొన్నారు.

➡️