జి.ఒ.117ను రద్దు చేయాలి

Jun 16,2024 22:19
ఫొటో : ఎంఎల్‌ఎ క్రిష్ణారెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న బిటిఎ నాయకులు

ఫొటో : ఎంఎల్‌ఎ క్రిష్ణారెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న బిటిఎ నాయకులు

జి.ఒ.117ను రద్దు చేయాలి

ప్రజాశక్తి-కావలి : జిఒ నెంబర్‌ 117ను రద్దు చేసి విద్యావ్యవస్థను గాడిలో పెట్టాలని బహుజన టీచర్స్‌ అసోసియేషన్‌ నాయకులు ఎంఎల్‌ఎ కావ్య క్రిష్ణారెడ్డిని కోరారు. ఈ మేరకు ఆదివారం ఎంఎల్‌ఎను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేసి సత్కరించారు. తరువాత విద్యావ్యవస్థకు సంబంధించిన 117 జిఒను రద్దుచేసి, ప్రాథమిక విద్యావ్యవస్థను బలోపేతం చేయాలని, సిపిఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్‌ ఇవ్వాలని, 12 పిఆర్‌సి త్వరగా అమలు చేయాలని, 11వ పిఆర్‌సి బకాయిలు చెల్లించాలని, అంతేకాకుండా, ఉద్యోగ, ఉపాధ్యాయులకు దీర్ఘకాలికంగా పరిష్కారం కానీ ఆర్థిక, సర్వీసు సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని కోరుతూ బిటిఎ పక్షాన వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మణి సుబ్బు, ఎద్దు బ్రహ్మయ్య, ఎం.ఆనందరావు, ది జ్ఞాన శేఖర్‌, పి శివరామయ్య, ఆర్‌ కోటేశ్వరరావు, ఎ.కిషోర్‌, పి.శివకృష్ణ, బి.అశోక్‌, పదర్ల శ్రీనివాసులు, డి.మనోహర్‌, టి.మహేంద్ర, సుబ్బరాయుడు, ఎన్‌.రామయ్య, షేక్‌.సందానీ సాహెబ్‌, రామకృష్ణ, సూరి తదితరులు పాల్గొన్నారు.

➡️