ప్రజా ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం

Jan 30,2024 16:34 #Kakinada

ప్రజాశక్తి-కోటనందూరు(కాకినాడ) : మంగళవారం నాడు కోటనందూరు గ్రామంలో స్థానిక సర్పంచ్ గరిసింగు శివలక్ష్మి దొరబాబు ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్షకార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల పరిషత్ అధ్యక్షుడు లగుడు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజల సద్వినియోగం పరుచుకోవాలి గతంలో ఎన్నడూ లేనంత విధంగా వైద్య రంగానికి అత్యధికమైన నిధులు కేటాయించి పరీక్షలను ఉచితంగా చేస్తున్నామని అన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు 25 లక్షల రూపాయలకు వైద్య ఖర్చులకు పెంచడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య అధికారిని ఎం.యామిని కావ్య, తుని మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ వెలగా వెంకటకృష్ణ జి వైఎస్ ఎంపిపి కే.రవణమ్మ కృష్ణ, ఎంపీటీసీ ఎం.సునీత ప్రకాష్, మండల వ్యవసాయ సలహా చైర్మన్ సుర్ల రాజు, ఉప సర్పంచ్ డి.సూర్యచంద్ర, హైస్కూల్ చైర్మన్ యు.శ్రీను, పాల్గొన్నారు.

➡️