సతమతం అవుతున్నా స్పందించని ప్రభుత్వాలు

Nov 20,2023 23:26 #palnadu district

 

ప్రజాశక్తి – చిలకలూరిపేట : అనేక సమస్యలతో సతమతం అవుతున్న అంగన్వాడీ వర్కుర్లు, హెల్పర్లను ప్రభుత్వం ఏ మాత్రమూ పట్టించుకోవడం లేదని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) పల్నాడు జిల్లా కార్యదర్శి జి.మల్లీశ్వరి విమర్శించారు. స్థానిక ఎన్‌ఆర్‌టి సెంటర్‌లో అంగన్వాడీలు సోమవారం చేపట్టిన ధర్నాలో ఆమె మాట్లాడుతూ తమ సమస్యలను పరిష్కరి ంచాలని అంగన్వాడీలు దీర్ఘకాలికంగా పోరాడుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదని, చర్చలకు ఆహ్వానించే ఉద్దేశమూ వాటికి లేకపోయిందని, పోరాడుతున్న వారిపై నిర్బంధం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. వేతనాలు పెంచాలని, గ్రాడ్యుటీ జెంచాలని ఇప్పటికే పలుమార్లు కిందిస్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు అధికారులు, ప్రజాప్రతి నిధులకు విన్నవించామని, అంగన్వాడీ యూనియన్లతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని గత మార్చిలో శాసన మండలిలో ఐసిడిఎస్‌ మంత్రి హామీని చ్చినా నేటికీ నెరవేర్చలేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో వచ్చేనెల 8న నిరవధిక సమ్మెకు సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్‌టి యు అనుబంధ అంగన్వాడీ యూనియన్లు నిర్ణయించినట్లు తెలిపారు. తెలంగాణలో కంటే రూ.వెయ్యి అదనంగా వేతనాన్ని ఏపీలో అమలు చేస్తామని అంగన్వాడీలకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ ఏమైందని, కనీసం తెలంగాణలో ఇస్తున్నం తైనా ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. మినీ సెంటర్లన్నింటినీ ప్రధాన సెంటర్లుగా మార్చాలని, వాటిల్లో పని చేసేవారికి ప్రధాన సెంటర్లలో ఇస్తున్న జీతాలనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.ఐదు లక్షలకు పెంచాలని, హెల్పర్ల ప్రమోషన్‌ నిబంధ నలు రూపొందించాలని, ఈ విషయంలో రాజకీయ జ్యోగాన్ని నివారించాలని కోరారు. ప్రమోషన్‌ వయసు 50 ఏళ్లకు పెంచాలన్నారు. సర్వీసులో ఉండి చనిపోయిన అంగన్వాడిల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, బీమా అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులు మాదిరి అంగన్వాడీలకూ రిటైర్మెంట్‌ వయసును 62 ఏళ్లకు పెంచాలన్నారు. మెడికల్‌ లీవులు ఇవ్వాలని, వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలను పెంచాలని, గ్లాసులను ప్రభుత్వ సరఫరా చేయాలని, పెండింగ్‌లో ఉన్న అద్దె, టిఎ బిల్లులు చెల్లించాలన్నారు. మూడు యాప్‌ రద్దుచేసి ఒక యాప్‌నే ఉంచాలన్నారు. ధర్నాలో యూనియన్‌ డివిజన్‌ అధ్యక్ష కార్యదర్శులు జి.సావిత్రి, కె.రమాదేవి, నాయకులు ఎస్‌.శారదా, ఆర్‌.పరిమళ, జి.రాణి, ఎస్‌.రాధారాణి, సిహెచ్‌ మల్లీశ్వరి, అంగన్వాడీలు పాల్గొన్నారు.

➡️