నష్టపోయిన వరి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి : మాజీమంత్రి గొల్లపల్లి

Dec 5,2023 15:03 #Konaseema

ప్రజాశక్తి -మామిడికుదురు (అంబేద్కర్ కోనసీమ జిల్లా) : మిచౌంగ్ తుఫాను వల్ల నష్టపోయిన వరి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు డిమాండ్ చేసారు.మామిడి కుదురు లో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు కలసి రైతుల కష్టాలను తెలుసుకున్నారు. వరి చేలను కోసి ధాన్యాన్ని రాసులు గా చేసుకున్నాక సమయానికి ప్రభుత్వం మిల్లులకు తలలించకుండా జాప్యం చెయ్యడం వల్ల ధాన్యం రాశులు తడిచి పోయి తీవ్రంగా నష్టం వాటిల్లిందని, కోతకు రెడీగా ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించగా, చేలు మొత్తం పడిపోయాయని, చేలు కోసి మోపులుగా కట్టుకుని మాసుళ్ళ కు రెడీ గా ఉన్నా మోపులు సైతం చెలల్లోనే తడిచిపోయాయని రైతులు సందర్శించిన గొల్లపల్లికి రైతుల ఇబ్బందులుతెలిపారు.ఈ అకాల వర్షాలు వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎకరాకు సుమారు 30వేల రూపాయలు పెట్టుబడులు అయ్యాయి అని పంట చేతికి వచ్చే సమయానికి ఈ తుఫాను వల్ల మొత్తం నాశనం అయిపోయాయని రైతులు వాపోయారు. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు సొమ్మును వెంటనే చెల్లించాలన్నారు . వైస్సార్సీపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక రైతులు అనేక సార్లు నష్టపోయినప్పటికి ఒక్క సారి కూడా రైతులను ఆడుకోలేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో ఈలి శ్రీనివాస్, కంచి విశ్వనాదం, ఇంటి గణపతి, ఇంటి మహేంద్ర, రుద్ర శ్రీనివాస్, కోలా సురేష్, పెచ్చెట్టి భాస్కరరావు, గాలి బేగ్, అప్పారి వెంకటేశ్వరావు, సాపే కాశీ, నైనాల శ్రీరామ్, కాట్రేనిపాడు నాగేంద్ర తదితరులు ఉన్నారు.

➡️