అంగన్వాడీల్లో గ్రాడ్యుయేషన్‌ డే వేడుకలు

గ్రాడ్యుయేషన్‌ డేలో పాల్గొన్న చిన్నారులు

ప్రజాశక్తి – బుచ్చయ్యపేట, వడ్దాది

బుచ్చయ్యపేట మండలంలో పలు గ్రామ పంచాయతీల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో గురువారం గ్రాడ్యుయేషన్‌ డే వేడుకలు నిర్వహించారు. ఆట పాటల కోసం అంగన్వాడీకి పోదాం అంటూ మండలంలోని కోమల్లపూడి, లోపూడి, విజయరామరాజుపేట, సచివాలయాల పరిధిలోని అంగన్వాడీ చిన్నారులతో ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సూపర్వైజర్‌ రాజరాజేశ్వరి మాట్లాడుతూ అంగన్వాడీ పరిధిలో ఐదు సంవత్సరాలు నిండిన పిల్లల్ని స్కూలుకి పంపించడానికి వీడ్కోలు పలుకుతూ మూడు సంవత్సరాలు నిండిన పిల్లలను అంగన్వాడీకి స్వాగతిస్తూ ఈ గ్రాడ్యుయేషన్‌ డే, అంగన్వాడీ బాట కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కోమలపూడి సచివాయం పరిధిలో ఐదుగురు, లోపూడి పరిధిలో 21 మంది, విజయరామరాజుపేట పరిధిలో 10 మంది ఐదు సంవత్సరాల నిండిన పిల్లలను స్కూళ్లకు పంపిస్తున్నట్లు తెలిపారు. మూడు సంవత్సరాలు నిండిన పిల్లలు కోమలపూడి పరిధిలో నిండిన ఆరుగురు, లోపూడి పరిధిలో 14, విజయరామరాజుపేట పరిధిలో ఎనిమిది మంది పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది ఎ.ధనలక్ష్మి, కుసుమకుమారి, జ్యోతి, లలిత సత్య, నూకరత్నం, వరహాలమ్మ, లలిత, అంగన్వాడీ హెల్పర్‌ నాగమణి, వైద్య, సచివాలయ సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.

➡️