ఘనంగా గణబాబు జన్మదిన వేడుకలు

May 10,2024 00:13 #Birth day, #Ganababu
Ganababu, Birth day

 ప్రజాశక్తి-గోపాలపట్నం : గోపాలపట్నంలోని విశాఖ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు , అభిమానుల సమక్షంలో బర్త్‌ డే కేక్‌ను కట్‌ చేశారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ, మీరంతా తనపై చూపిన ప్రేమకు కృతజ్ఞతతో ఉంటానన్నారు. వైసిపి అవినీతి పాలనకు రోజులు దగ్గర పడ్డాయన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే ప్రభుత్వం రాబోతుందని తెలిపారు.

➡️