పోలీసుల అదుపులో అంగన్వాడీలు

Jan 22,2024 14:26 #Guntur District
guntur sattenapalli

ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్ : అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చలో విజయవాడకు పిలుపిచ్చిన నేపథ్యంలో విజయవాడ వెళుతున్న అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. సత్తెనపల్లి రైల్వే స్టేషన్ కు ఆటోలో వెలుతున్న అంగన్వాడీ కార్యకర్తలను సత్తెనపల్లి పట్టణ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. నందిగామ అడ్డరోడ్డు వద్దు తెల్లవారుజామున 4 గంటల నుండి పోలీసులు వాహనాలను తనిఖీ చేపట్టారు. సత్తెనపల్లి డిఎస్పీ బి ఆదినారయణ ఆద్వర్యంలో పట్టణ పోలీసులు ఆర్టీసీ బస్సులు, ఆటోలు కార్లను తనిఖీ చేశారు.

➡️