చేనేతలకు అన్యాయం చేసిన టిడిపిని ఓడించండి

Mar 23,2024 14:12 #Guntur District

ప్రజాశక్తి-మంగళగిరి : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి చేనేతలకు ఎక్కడా సీటు కేటాయించలేదని రానున్న ఎన్నికల్లో టిడిపిని ఓడించడానికి చేనేతలు కృషి చేయాలని జాతీయ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ నారాయణ శనివారం మంగళగిరి ప్రెస్ క్లబ్ జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేనేత జనాభా 40 లక్షలు ఉన్నారని, రాష్ట్రంలో 12 అసెంబ్లీ స్థానాల్లో అత్యధిక ఓట్లు కలిగి ఉన్నారని తెలిపారు. అయినప్పటికీ టిడిపి ఇప్పటివరకు ప్రకటించిన అసెంబ్లీ సీట్లలో ఒక్క సీటు కూడా చేనేత కులాలకు కేటాయించలేదని విమర్శించారు. ఇదేవిధంగా టిడిపి ప్రవర్తిస్తే రానున్న ఎన్నికల్లో టిడిపి ఘోర పరాయిజాయానికి పని చేస్తామని తెలిపారు. ఇప్పటికైనా టిడిపి అధినాయకత్వం ఆలోచించి చేనేత కులాలకు తగు న్యాయం చేసే విధంగా అసెంబ్లీ సీటు చేనేత కులాలకు తగు న్యాయం చేసే విధంగా అసెంబ్లీ సీట్లు రెండు లేదా మూడు కేటాయించాలని డిమాండ్ చేశారు. మంగళగిరి చేనేత నాయకులకు చీరాల అసెంబ్లీ సీటు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా అన్యాయం చేశారని తెలిపారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం లో వైఎస్ఆర్సిపి ఇప్పటికే మురుగుడు లావణ్యను అభ్యర్థిగా ప్రకటించడం జరిగిందని తెలిపారు. చేనేత కులాల వారందరూ లావణ్య గెలుపుకు కృషి చేస్తామని తెలిపారు. లోకేష్ ను ఘోరంగా ఓడించడానికి ప్రయత్నిస్తామని హెచ్చరించారు. ప్రముఖ న్యాయవాది కే శ్రీనివాసరావు మాట్లాడుతూ 12 అసెంబ్లీ స్థానాల్లో చేనేత కులాల జనాభా ఉన్నారని వారికి న్యాయం చేయాలని అన్నారు. చీరాల అసెంబ్లీ సీట్లు వైఎస్ఆర్సిపి కరణం బలరాం కు ఇవ్వడం జరిగిందని అది కూడా పునరా ఆలోచన చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మంగళగిరిలో చేనేత కులానికి చెందిన మురుగుడు లావణ్య గెలుపుకు చేనేత కులాల వారందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మునగాల గిరిధర్, న్యాయవాది ఎం మురళి, జి బాబు, గోలి శివయ్య పాల్గొన్నారు.

➡️