మరో ప్రపంచపు మహాకవి శ్రీశ్రీ

Jun 15,2024 13:10 #Guntur District

సి.ఎస్.ఆర్.ప్రసాద్, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్

ప్రజాశక్తి-గుంటూరు : మరో ప్రపంచవు మహాకవి శ్రీశ్రీ అని మాజీ మంత్రి డొక్కా మాణిక్యరావు సార్ విప్లవ రచయితల సంఘం సీనియర్ నాయకులు సి.ఎస్.ఆర్.ప్రసాద్ లు పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక బ్రాడీపేటలోని మద్రాస్ కాఫీ హోటల్ లో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ – జాషువా – పూలే – పెరియార్ లిటరేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కవి, జర్నలిస్ట్ బి.విల్సన్ అధ్యక్షతన మహాకవి శ్రీశ్రీ 41వ వర్ధంతి సభ జరిగింది. తొలుత శ్రీశ్రీ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో మేరు పర్వతం లాంటి మహాకవి శ్రీశ్రీ అన్నారు. మహాకవి శ్రీశ్రీ కార్మిక, కర్షక, పేద ప్రజల కోసం తమ సమాజ స్థాపనే ధ్యేయంగా అవిశ్రాంతంగా కవిత్వాన్ని రాశాడని తెలిపారు. మహాప్రస్థానం, మరో ప్రస్థానం, సిప్రాలి వంటి కవిత్వ పుస్తకాలు, కథలు, అనువాద కవిత్వం, అనంతo వంటి స్వీయ చరిత్ర ఆయన రచనల్లో ప్రామాణికమైనవన్నారు. ప్రత్యేకించి ఖడ్గసృష్టి వంటి కవితల పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందని గుర్తు చేశారు. సభలో వక్తలు శ్రీశ్రీ కవితలు చదివి వినిపించారుఈ కార్యక్రమంలో త్రిపురనేని సాహితీ సమితి సభ్యులుచెరుకూరి సత్యనారాయణ, జొన్నలగడ్డ రామారావు, వీసీకే జయసుధ, కోలా నవజ్యోతి, గాయకులు జెట్టి బాబురావు, తాటికొండ నరసింహారావు, తిరువల్లూరి పద్మ, సాధు మాల్యాద్రి, నల్లమడ రైతు సంఘం నాయకులు డాక్టర్ కొల్లా రాజ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

➡️