పిన్నెల్లిని పోటీకి అనర్హుడిగా ప్రకటించాలి: హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ

మాట్లాడుతున్న హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ

 పల్నాడు జిల్లా : సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజున గృహ నిర్బంధంలో ఉండాల్సిన మాచర్ల వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, తన నియోజకవర్గంలోని 202 వ పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లి పోలింగ్‌ అధికారుల ముందే ఈవిఎం, వివి ప్యాట్‌ ధ్వంసం చేసిన ఆయనను కఠినంగా శిక్షించాలని హైకోర్టు న్యాయవాది ఓ.లక్ష్మీనారాయణ డిమాండ్‌ చేశారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావు పేటలోని టిడిపి జిల్లా కార్యాలయంలో బుధ వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లక్ష్మీనారాయణ మాట్లా డుతూ పోలింగ్‌ కేంద్రంలోకి అక్రమంగా ప్రవే శించి ఎన్నికల సామగ్రిని, ఈవిఎం లను పగలగొట్టిన ఆయనను పోటీకి అన ర్హుడిగా ప్రకటించాలన్నారు. నరసరావుపేట, మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో అత్యంత సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయని, అక్కడ పటిష్ట భద్రత చర్యలు తీసుకోవాలని గతంలో ఎలక్షన్‌ కమిషన్‌ సూచించినప్పటికీ పోలీసులు చర్యలు చేపట్ట లేదన్నారు. పల్నాడులో జరిగిన హింసాత్మక ఘటనల దృష్ట్యా కౌంటింగ్‌ రోజున కౌం టింగ్‌ కేంద్రం వద్ద భద్రత పటిష్టం చేయాలని డిమాండ్‌ చేస్తూ పరిశీలించేందుకు వెళుతున్న టిడిపి ఏజెంట్లను అనుమతించడం లేదన్నారు. ఆయా ఘటనలలో టిడిపి వర్గీయులపై కావాలనే తప్పుడు కేసులు పెడుతున్నా రన్నారు. దాడుల్లో పాల్గొన్న వైసిపి నేతలపై తూతుమంత్రంగా కేసులు పెట్టారని ఆరో పిం చారు. జిల్లాలో చోటు చేసుకున్న సంఘటనలపై పోలీ సులు నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో న్యాయవాది డి.ఉదయశ్రీ, జె.సుబ్బారావు పాల్గొన్నారు. పాతగణేశునిపాడులో కార్డన్‌ సెర్చ్‌ప్రజాశక్తి-పిడుగురాళ్ళసార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జరిగిన రాజకీయ ఘర్షణలు దృష్ట్యా మండలంలోని పాతగణేశునిపాడు గ్రామంలో బుధవారం పోలీస్‌ పట్టణ సిఐ వీరాంజి నేయులు ఆధ్వర్యంలో కార్డన్‌ సెర్చ్‌ నిర్వ హించారు. జరిగిన ఎన్నికల్లో గ్రామంలో ఇరు పార్టీలకు చెందిన వారు దాడులు చేసుకున్నారు.ఎన్నికల ఫలితాల తర్వాత ఎటువంటి ఘటనలు జరగకుండ ముందస్తు చర్యలలో భాగంగా గ్రామంలోని ఇళ్ళు,దుకాణాలు, గౌడౌన్లలో పోలీ సులు తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలలో గ్రామంలో పత్రాలు లేని సుమారు ద్విచక్ర వాహానాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో ఎవరైన అవాంఛ నీయ ఘటనలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అలాగే, పెట్రోల్‌ను బాటిళ్ళలో అమ్మ కూడదని, ద్విచక్ర వాహనాలపై నెంబర్‌ కనిపించేలా కచ్చితంగా ఉండాలని మరే ఇతర స్టికర్లు ఉన్న వాహనాలు సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. వాహన దారులు తమ వాహన ధృవీకరణ పత్రాలు తమ వెంట కలిగి ఉండాలని లేదా ఫోన్‌లో ఉన్న ఫర్వాలేదని చెప్పారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని ,ర్యాష్‌ డ్రైవింగ్‌ చేయడం, వాహనాల సైలన్సర్లు మార్చి పెద్ద శబ్ధాలు వచ్చే సైలన్స్‌ర్లు పెట్టకూడదని తెలిపారు. నియమ నిబంధనలు ఉల్లం ఘించే వారిపై చర్యలు తప్పవని సిఐ హెచ్చరించారు.

➡️