మానవత సంస్థకు అండగా నిలవాలి

ప్రజాశక్తి-శింగరాయకొండ : మానవత స్వచ్ఛంద సేవా సంస్థ కు అందరూ అండగా నిలవాలని ప్రముఖ వైద్యులు డాక్టర్‌ బి.హరిబాబు తెలిపారు. శింగరాయకొండ లోని మానవత కార్యాలయంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ హరిబాబు మాట్లాడుతూ సంస్థ ఆశయాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తతంగా తీసుకెళ్లాలన్నారు. మానవతా స్వచ్ఛంద సంస్థలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసే బాధ్యత అందరూ తీసుకోవాలన్నారు. సంస్థ ప్రధాన కార్యదర్శి కోటపాటి నారాయణ మాట్లాడుతూ సంస్థ ఆవిర్భావం, అభివద్ధికి సహాయ సహకారాలు అందించిన వారి గురించి వివరించారు. మలినేని లక్ష్మయ్య ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కె.తేజోమూర్తి మానవత సంస్థకు ఆర్థిక సహాయం ప్రకటించారు. మానవత స్వచ్ఛంద సేవా సంస్థకు స్వచ్ఛందంగా స్థలం దానం చేసిన దాత శింగరాయకొండ పంచాయతీ వార్డు మెంబర్‌ గంజి సుబ్బారావు మానవత సంస్థ కు రూ.50 వేల విరాళం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జెట్టి సూర్యచంద్రశేఖర్‌ రెడ్డి, మహంకాళి నరసింహారావు, మునగపాటి వెంకటరత్నం, ప్రధానో పాధ్యాయులు మర్రి శ్రీనివాసరావు, పి.శ్రీనివాసులు, డివికెవి. ప్రసాదరావు, గుంటక రామలక్ష్మమ్మ, మందలపు బాబూరావు, సుధాకర్‌రెడ్డి, ఉప్పిరెట్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️