మరో అవకాశమిస్తే వినుకొండ రూపురేఖలు మారుస్తా

Apr 23,2024 00:19

ప్రజాశక్తి – వినుకొండ : తనకు ప్రజలు మరోసారి అవకాశమిస్తే వినుకొండ రూపురేఖలు మారుస్తారని వైసిపి ఎమ్మెల్యే వైసిపి అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. నామినేషన్‌ దాఖలు కోసం సోమవారం ఆయన స్థానిక కారంపూడి రోడ్డులోని బ్రహ్మనాయుడు కళ్యాణ మండపం నుండి భారీ ప్రదర్శనగా వెళ్లారు. ఆర్టీసీ బస్టాండ్‌, శివయ్య స్తూపం, అరుణ థియేటర్‌ మీదుగా తహశీల్దార్‌ కార్యాలయంలోని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. ఆర్వో సుబ్బారావు బ్రహ్మనాయుడు నామినేషన్‌ పత్రాలు అందించారు. అనంతరం ఆయన మీడి యాతో బ్రహ్మనాయుడు మాట్లా డుతూ సిఎం సహకారంతో వినుకొండ నియోజ కవర్గాన్ని 60 శాతం అభివృద్ధి చేశానని, మళ్లీ అవకాశం ఇస్తే నూరుశాతం అభివృద్ధిని పూర్తి చేస్తానని చెప్పారు. తనను ఓడించేందుకు కుట్రలు పన్నుతు న్నారని, పట్టణానికి తాగునీరు అందించే చెరువులో నీళ్లను మాయం చేసేందుకు కొందరు యత్నించారని ఆరోపించారు. నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్‌ కుమార్‌ యాదవ్‌నూ గెలిపించాలన్నారు.

➡️