మన ఇల్లు మన పేరుమీద ఉండాలంటే జగన్‌ పోవాలి

Apr 30,2024 21:27

ప్రజాశక్తి-విజయనగరం కోట  : మన ఇల్లు మన పేరు మీద ఉండాలంటే జగన్‌ పోవాలి.. బాబు రావాలని విజయనగరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. మంగళవారం వేణుగోపాల పురం, హనుమాన్‌ నగర్‌ రాజుల పేట, సిద్ది వినాయక్‌ నగర్‌ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు ప్రకటించిన బాబు సూపర్‌ సిక్స్‌ పథకాలను వివరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు వంటివని,అందుకే తాజా మేనిఫోస్టోలో అనేక సంక్షేమ పథకాలను ప్రకటించారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, కార్యాలయ కార్యదర్శి రాజేష్‌ బాబు పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్‌, మండల పార్టీ అధ్యక్షులు బొద్దల నర్సింగరావు, కార్యదర్శి గంటా పోలినాయుడు రాష్ట్ర బీసీ నాయకులు వేచలపు శ్రీనివాసరావు, అవనాపు విజరు పిల్లా విజరు కుమార్‌, గాడు అప్పారావు తదితరులు పాల్గొన్నారు. వైసిపి నుంచి పలువురు టిడిపిలో చేరికవైైసిపికి చెందిన పలువురు మంగళవారం టిడిపిలో చేరారు. 15వ డివిజన్‌కు చెందిన దున్న రాంబాబు, దండు హరి, పోతాబత్తుల వెంకటరావు, గండు శ్రీనివాసరావు తో పాటు 50 కుటుంబాలు , 49వ డివిజన్‌ కు చెందిన భవిరి నాగభూషణ్‌, తలే రామకష్ణ, బుద్దా నాగరాజు, తోలాపు బాలకృష్ణ గారితో పాటు 50 కుటుంబాలు వారు మొత్తం 100 కుటుంబాలు టిడిపి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు సమక్షంలో టిడిపిలో చేరారు.

➡️