అక్రమంగా మట్టి తవ్వకాలు

Apr 17,2024 22:13

ప్రజాశక్తి – వేపాడ : మండలంలోని కుంపల్లి రెవెన్యూ పరిధిలోని రాజు చెరువులో ఆ గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులు ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. చెరువులో మట్టి, కంకర తవ్వకాలకు ఎటువంటి అనుమతులూ లేకుండా రాత్రి బాగాన తవ్వకాలు చేపట్టి ఇతర గ్రామాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అదే గ్రామానికి చెందిన కొంతమంది రైతులు గ్రామ సచివాలయ సిబ్బందికి తెలియజేసినా వెనుకడుగు వేయని ఆ నాయకుడు మట్టి తవ్వకాలను తనకు నచ్చినట్లు తవ్వుతానని అనుమతులు తీసుకునే పనిలేదని ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండని చెబుతు న్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తు న్నారు. ఈ తవ్వకాలపై గ్రామ రెవెన్యూ అధికారిని వివరణ కోరగా ఈ విషయాన్ని తహశీల్దార్‌ దృష్టికి తీసుకెళ్లాని చెప్పారు. మట్టి తవ్వకాలకు ఎటువంటి అనుమ తులూ లేవని స్పష్టం చేశారు.

➡️