108లోనే ప్రసవం – తల్లీబిడ్డ క్షేమం

Apr 13,2024 11:20 #108, #Childbirth, #Delivery

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : అనంతపురం జిల్లా నార్పల మండలం నాయనాపల్లి క్రాస్‌ కు చెందిన గర్భిణీకి 108 లోనే ప్రసవం అయ్యింది. శనివారం ఉదయం 108 సిబ్బంది తెలిపిన వివరాల మేరకు …. నాయనపల్లి క్రాసింగ్‌ కు చెందిన గర్భిణీ మనిషా (22)కి రెండవ ప్రసవం కోసం తెల్లవారుజామున నాలుగున్నర గంటల సమయంలో నొప్పులు రావడంతో ఆస్పత్రికి తరలించడానికి కుటుంబ సభ్యులు 108 కి ఫోన్‌ చేశారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది గర్భిణీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గం మధ్యలో 108 వాహనం లో నే సిబ్బంది ఆమెకు ప్రసవం చేశారు. తల్లి బిడ్డ ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారని 108 వాహన సిబ్బంది తెలిపారు. 108 సిబ్బంది ఈ ఎన్‌ టి అనిల్‌ కుమార్‌ పైలెట్‌ రాజేష్‌ కు గర్భిణీ కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

➡️