మోడల్‌ పోలింగ్‌ స్టేషన్‌ ప్రారంభం

Apr 22,2024 22:21

 ప్రజాశక్తి-విజయనగరం కోట  :  పోలింగ్‌ ప్రక్రియపై వివిధ వర్గాల ప్రజలకు అవగాహన కల్పించేందుకు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన నమూనా పోలింగ్‌ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి సోమవారం ప్రారంభించారు. స్వీప్‌ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ పోలింగ్‌ కేంద్రంలో, పోలింగ్‌ అధికారుల స్థానాలు, ఓటింగ్‌ కంపార్ట్‌మెంట్‌, ఏజెంట్ల స్థానాలు, నమూనా ఇవిఎంలను పరిశీలించారు. పోలింగ్‌ ప్రక్రియపై ప్రజల్లో విస్తత అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌, స్వీప్‌ నోడల్‌ అధికారి, హౌసింగ్‌ పిడి శ్రీనివాసరావు, ఎన్నికల సూపర్నెంట్‌ ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️