పోలింగ్‌ కేంద్రాల వద్ద మౌలిక సౌకర్యాలు కల్పించాలి

Apr 27,2024 21:46

ప్రజాశక్తి – కొమరాడ: ప్రతి పోలింగ్‌ కేంద్ర వద్ద సౌకర్యాలు కల్పించాలని పార్లమెంటరీ నియోజకవర్గ సాధారణ పరిశీలకులు ప్రమోద్‌ కుమార్‌ అన్నారు. కొమరాడలో పర్యటించిన ఆయన కొమరాడ, విక్రంపురం పోలింగ్‌ కేంద్రాలను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్‌ కేంద్రం వద్ద వసతి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పార్లమెంటరీ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు గుర్‌ కరణ్‌ సింగ్‌, కురుపాం నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి వెంకట రమణ, స్థానిక అధికారులు పాల్గొన్నారు.పోలింగ్‌ సమయంలో బిఎల్‌ఒలు జాగ్రత్తగా ఉండాలి : ఆర్‌ఒమే 13న జరగనున్న పోలింగ్‌ సమయంలో బిఎల్‌ఒలు కీలకపాత్ర పోషిస్తూ జాగ్రత్తగా ఉండాలని కురుపా నియోజకవర్గ ఎన్నికల రిటైర్నింగ్‌ అధికారి వివి రమణ అన్నారు. శనివారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో బిఎల్‌ఒలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొమరాడ మండలంలోని 60 పోలింగ్‌ బూతులున్నాయన్నారు. పోలింగ్‌ సమయంలో బిఎల్‌ఒలు కీలకపాత్ర పోషించాలని తెలిపారు. పోలింగ్‌ సమయంలో సిబ్బంది ఎటువంటి నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. మండలంలోని 60 పోలింగ్‌ కేంద్రాల్లో ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేలా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలింగ్‌ జరుగుతున్న సమయంలో విద్యుత్‌ అంతరాయం లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటు హక్కు వేసే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ రమేష్‌, ఎంపిడిఒ మల్లికార్జునరావు, బిఎల్‌ఒలు, ఎన్నికల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి : ఆర్‌ఒ సీతంపేట : పాలకొండ నియోజకవర్గంలోని ప్రిసైడింగ్‌ అధికారులకు, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులకు ఇస్తోన్న ఎన్నికల శిక్షణ తరగతులను పాలకొండ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి శుభం బన్సల్‌ శనివారం పరిశీలించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల శిక్షణ తరగతులను అధికారులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏవైనా సందేహాలుంటే ఇప్పుడే నివృత్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మాస్టర్‌ ట్రైనీలు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.పోస్టల్‌ బ్యాలెట్‌కు ఏర్పాట్లు చేయాలి : ఆర్‌ఒప్రజాశక్తి – పాలకొండమే 5 నుండి 9 వరకు జరిగే పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేయాలని పాలకొండ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి శుభం బన్సల్‌ అన్నారు. శనివారం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ కోసం పాలకొండ హైస్కూలు ప్రాంగణాన్ని ఆర్వో ఎన్నికల, పోలీస్‌ సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆర్వో మాట్లాడుతూ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ సమయంలో ఎన్నికల అధికారులు, సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. ఎండ నుంచి రక్షణ కలిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. భద్రతా ఏర్పాట్లు చేయాలని సిఐకి సూచించారు. మండలం వారీగా కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో సిఐ, తహశీల్దార్లు, డీటీలు, ఇతర ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️