ఇంకొల్లు పోలేరమ్మ తల్లి ఆలయంలో చోరీ

May 22,2024 11:07 #Inkollu, #stolen, #temple

ప్రజాశక్తి-ఇంకొల్లు (బాపట్ల) : స్థానిక ఎన్టీఆర్‌ విగ్రహానికి సమీపంలో ఉన్న పౌలు రోడ్‌ లోని పోలేరమ్మ తల్లి ఆలయంలో బుధవారం రాత్రి దొంగతనం జరిగింది. వివరాలలోకి వెళితే పోలేరమ్మ ఆలయంలో బయట ఉన్న గోడ దూకి పోలేరమ్మ గర్భగుడి ద్వారా ఉన్న గేటు తాళం పగలగొట్టి తలుపు ద్వారానికి ఉన్న తాళాలను చేదించి, పోలేరమ్మ విగ్రహానికి అలంకరించిన బంగారు ముక్కు పుడకలు బంగారు బట్టు బిళ్ళతో పాటు వెండి చేతులు వెండి పాదాలు వెండి వడ్రాలము వెండి గిన్నె, వెండి గెంట పళ్లెం, ఇతర వస్తువులు దుండగులు ఎత్తుకెళ్లారు. రోజువారీ కార్యక్రమంలో భాగంగా గుడికి కరిచంద్రమ్మ శుభ్రం చేయడానికి, ముగ్గు వేయటానికి తలుపు తీయడానికి వచ్చి చూడగా విగ్రహానికి ఉన్న వెండి, బంగారపు వస్తువులు అపహరించినట్లు గుర్తించి విషయాన్ని స్థానికులకు తెలిపింది. గుడికి సంబంధించిన కమిటీ నిర్వాహకులు ఈ విషయాన్ని ఇంకులు పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినవారిలో కర్రీ అయ్యేవారు, నాయన వీరయ్య బండ్ల నాగేశ్వరరావు, హరి గోపాల్‌, తదితరులు ఉన్నారు. దాదాపు కేజీకి పరిమాణము ఉన్న వెండి వస్తువులు, రూ.1,20,000 వరకు ప్రస్తుత ధరను బట్టి ఉంటుందని తెలిపారు. అలానే మరో లక్ష రూపాయల వరకు బంగారం వస్తువుల విలువ ఉంటుందని వివరించారు. ఆలయం ముందు అమర్చిన సీసీ కెమెరాకు సంబంధించిన బాక్సును కూడా దొంగలు ముందుగానే కత్తిరించి చోరీ చేసినట్లు తెలిపారు.

➡️