కొత్తూరు పంచాయితీలో అవకతవకలపై విచారణ

విచారణ చేస్తున్న డిఎల్‌పిఒ మూర్తి

ప్రజాశక్తి-అనకాపల్లి

అనకాపల్లి మండలం కొత్తూరు పంచాయతీలో జరిగిన అవకతవకలపై లోకాయుక్తకు అందిన ఫిర్యాదుతో బుధవారం ఇన్చార్జి డిఎల్పిఓ మూర్తి విచారణ చేపట్టారు. దీనిపై ఆయన మాట్లాడుతూ 2023వ సంవత్సరంలో పంచాయతీలో జరిగిన అవకతవకలపై లోకాయుక్తకు సమాచార హక్కు చట్టం సమన్వయకర్త చింత గోపి ఫిర్యాదు చేశారని తెలిపారు. లోకాయుక్త ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ అధికారి శిరీష రాణి సూచనల మేరకు విచారణ చేపడుతున్నామన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల భవనాల నిర్మాణ చేపట్టారని, దీనిపై రికార్డులు అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.అధికారుల తీరుపై అసహనంమేజర్‌ పంచాయతీ అయిన కొత్తూరులో సిబ్బంది నిబంధనలు పాటించకపోవడం, రికార్డులు అందుబాటులో ఉంచకపోవడం, అక్రమ నిర్మాణాలపై అవగాహన లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో ఏ పంచాయతీలోనూ ఇన్ని ఫిర్యాదులు రాలేదన్నారు. రానున్న కాలంలో సిబ్బందికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.వార్డు సభ్యుల ఫిర్యాదుఇదిలా ఉండగా పంచాయతీ వార్డు సభ్యులు పలు అంశాల్లో జరిగిన అక్రమాలపై డిఎల్‌పిఓ మూర్తికి ఫిర్యాదు చేశారు. మోటార్ల కొనుగోలు పేరుతో అక్రమాలు జరిగాయని, లక్ష 60 వేల రూపాయల విద్యుత్తు పరికరాల కొనుగోళ్లకు సంబంధించి బిల్లులు మాత్రమే ఉన్నాయని, పరికరాలు లేవని పేర్కొన్నారు. స్వీపర్ల పేరిట రూ.60 వేలు దుర్వినియోగం అయ్యాయన్నారు. పంచాయతీ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండానే వాణిజ్య సముదాయాల నిర్మాణం, గృహ నిర్మాణాలు, పంచాయతీ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. దీనిపై పూర్తి విచారణ చేపట్టే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

➡️