మే24 నుంచి జూన్‌ 01వ తేదీ వరకు ఇంటర్‌ సప్లమెంటరీ పరీక్షలు

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌ : మే 24 నుంచి జూన్‌ 01వ తేదీ వరకు ఇంటర్‌ సప్లమెంటరీ పరీక్షలు ప్రారంభంకానున్నాయని డి.ఆర్‌.ఓ,జీ. నరసింహులు తెలిపారు. బుధవారం స్థానిక జిల్లా కలెక్టర కార్యాలయంలోని డిఆర్వో ఛాంబరులో ఇంటర్మీడి యట్‌ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై డిఆర్వో నరశింహులు.. జిల్లా కమిటీ సభ్యులు, విద్యా, రెవిన్యూ, పోలీసు, విద్యుత్తు, వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్‌, ఏపియస్‌ ఆర్‌ టిసి, పోస్టల్‌ తదితర శాఖల అధికారులతో కలసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా డిఆర్వో నరసింహులు మాట్లాడుతూ.. మే 24 నుండి జూన్‌ 01వ తేదీ వరకు ఇంటర్మీ డియేట్‌ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇంట ర్‌ మొదటి సంవత్సరం ఉ.9.00 గంటల నుంచి మ.12.00 గంట ల వరకు, ఇంటర్‌ రెండవ సంవత్సరం మ. 2.30 గంటల నుండి సా.5.30 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. జిల్లాలో25 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, వీటిలో మొదటి, రెండవ సంవత్సరానికి సంబంధించిన మొత్తం 19794 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. మొదటి సంవత్సరం జనరల్‌ కింద 14788 మంది, ఒకేషనల్‌ కింద 801 మంది, విద్యార్ధులు హాజరు కానున్నారని తెలిపారు. ఇంట ర్మీడియట్‌ రెండవ సంవత్సరం జనరల్‌ కింద 3624 మంది, ఒకేషనల్‌ కింద 581 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. విద్యార్థులు హాల్‌ టికెటు, గుర్తింపు ఐడి కార్డుతో పరీక్షకు గంట ముందు హాజరు కావాలన్నారు. పరీక్షలు వ్రాసే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు పరీక్ష సమయా నికి కంటే ఒక గంట ముందు పరీక్ష కేంద్రాలకు హాజరు కావాలని అన్నారు. నిరంతరాయంగా విద్యుత్తు ఉండేలా చూసుకోవాలని, మొబైల్‌ ఫోన్లు, కాలిక్యు లేటర్లు, ఐప్యాడ్‌, బ్లూటూత్‌, పేజర్‌ లేదా ఇంట్రాక్ట్‌ ప్రోగ్రామింగ్‌ చేయగల ఇతర ఎలక్ట్రాన్రిక్‌ పరికరాలను పరీక్షా కేంద్రానికి అనుమతి లేదని తెలిపారు.
వేసవి దష్ట్యా పరీక్ష కేంద్రాల్లో మంచినీటి సరఫరా, పూర్తి స్థా యి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. వైద్య శిబిరా లు ఏర్పాటు చేసి, ఓఆర్‌ యస్‌ ప్యాకెట్లు ఉంచాలని వైద్య అధి కారులను ఆదేశించారు. జూన్‌ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్‌ ఉన్న సందర్భంలో పరీక్షలు జరిగే తేదీలలో పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేసి, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతా లలో కంప్యూటరు సెంటర్లు, జి రాక్స్‌ సెంటర్లను మూసి వేయించాలని ఆదేశించారు. పరీక్ష నిర్వహణ రోజుల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పరీక్ష సమయములకు అనువుగా రీషెడ్యూల్‌ చేసి బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాలలో శానిటేషన్‌, త్రాగునీటిని ఏర్పాటు చేయాలని డిపీవో, ఆర్డబ్ల్యూయస్‌ అధికారులను ఆదేశించారు. పరీక్షలలో ఎటు వంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని తెలిపారు.
ఆర్‌ఐఓ, బిఐఈ, ఎన్‌.ఎల్‌.వి.ఎల్‌ నరసింహం మాట్లాడుతూ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నెంబరు: 9492226232 ఏర్పాటు చేశామని తెలిపారు. ఫ్లయింగు స్క్వాడ్‌ టీమ్‌ 1, సిట్టింగ్‌ స్క్వాడ్‌ టీం 1 ఏర్పా టు చేయడం జరిగిందని తెలిపారు. పరీక్షలు సజావుగా జరిగే విధంగా అన్ని ముందస్తు తీసుకున్నామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా విద్యా శాఖ అధికారి కే.వాసు దేవరావు, డిహెచ్‌ఎంవో, పి. జాన్స న్‌ రాజు, ఎపీ ఈ పి. డీసీఎల్‌, ఏ ఎన్‌ వి ప్రసాద్‌, డి జి పి ఓ, డి. రాంబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నా రు.

➡️