ఇఎంటి పోస్టుల భర్తీలో ఉల్లంఘనలు

ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌ పోస్టుల భర్తీలో గైడ్‌లెన్స్‌ ఉల్లంఘనల పరంపర కొనసాగుతోంది. 2022 ఆగష్టు, 2022 నవంబర్‌, 20 23 ఫిబవరి మాసాల్లో ఇఎంటి పోస్టుల భర్తీ ప్రక్రియ నడిచింది. రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలైన విజయనగరం, గుంటూరు, పశ్చిమగోదావరి తదితర జిల్లాల్లో పీజీలను రిక్రూట్‌మెంట్లకు అనుమతించినట్లు తెలుస్తోంది. కానీ కడప జిల్లాలో ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌ కోర్సులో డిప్లమా పూర్తి చేసిన పీజీలను కాదని, డిగ్రీ కోర్సు తరహా ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీ షియన్‌ చదివిన వారి అర్హులుగా నిర్ణయించడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఇందులోభాగంగా ఈనెల 18న డిగ్రీ కోర్సు పూర్తి చేసిన ముగ్గురికి అపాయింట్‌మెంట్‌ ఆర్డర్సు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో పలువురు పీజీలు పలుమార్లు కడప జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో విస్మయాన్ని కలిగిస్తోంది. ప్రజాశక్తి – కడప ప్రతినిధి జిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ ఊపందుకుంది. ఈమేరకు గత ఫిబ్రవరిలో కడప ప్రభుత్వ వైద్య కళాశాల యంత్రాంగం 48 ఇఎంటి పోస్టుల భర్తీకి నోటి ఫికేషన్‌ విడుదల చేసింది. ఈమేరకు 48 మంది టెక్నీషియన్‌ పోస్టులకు దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో 12 మంది పీజీ డిప్లమా, 12 మంది బిఎస్‌సి, మరో 18 మంది ఇతర కోర్సులు చేసిన అభ్యర్థుల దరఖాస్తులు ఉన్నట్లు సమాచారం. వీరిలో 12 పీజీ దరఖాస్తులను తిరస్కరించి భర్తీ చేపట్టడం పీజీల్లో ఆందోళన నెలకొంది. 2013 సంవత్సరంలో 108 సేవల విభాగంలో సీనియర్లుగా గుర్తింపు పొంది, ఎంట్రన్స్‌ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సులకు రాష్ట్రప్రభుత్వం ఎంపిక చేసింది. బిఎసి కంటే ఉన్నత విద్య పీజీ కోర్సును అభ్యసించిన వారిని విస్మరించి డిగ్రీ (బిఎస్‌సి ఇఎంటి) చేసిన వారిని అర్హులుగా నిర్ణయించమే మిటనే ప్రశ్న వినిపిస్తోంది. 2022 నవంబర్‌లో విజయ నగరం, తాజాగా కడప జిల్లాలో మినహా మిగిలిన జిల్లాలో కొత్తగైడ్‌ లైన్స్‌ ప్రకారం పీజీలను పోస్టింగ్స్‌కు అర్హులుగా చేసి పోస్టుల భర్తీ నడిపిన జిల్లాలను ఉద హరిస్తుండడం గమనార్హం. కానీ జిల్లా సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్‌ గైడ్‌ లెన్స్‌ అప్‌డేట్‌ గాకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడంపై విమర్శల వర్షం కురుస్తోంది. 2022 ఆగష్టులో రాష్ట్రంలోని 10 పాత వైద్య కళా శాలలకు మూడు పోస్టుల చొప్పున 64 టెక్నీషియన్‌ పోస్టులను భర్తీ ప్రక్రియ నడిచింది. ఇందులో ఇప్పటి వరకు 61 పోస్టులను భర్తీ చేసినట్లు సమాచారం. మిగిలిన మూడు పోస్టులు జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందినవి కావడం గమనార్హం. వీటిని భర్తీ చేయాలనే అప్పటి జాయింట్‌ కలెక్టర్‌ సూచనను జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ బేఖాతర్‌ చేశారనే విమర్శలు ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి కీ.శే వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి యూనివర్శిటీగా నామకరణం చేసిన మెడికల్‌ కళాశాలల్లో ఆయన ఉన్నత విద్యకు సిఫారసు చేసిన పీజీ అభ్యర్థులను తిరస్కరించడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌ పోస్టుల రిక్రూట్‌మెంట్‌లో పీజీ డిప్లమా, బిఎస్‌సి ఇఎంటిలకు సమాన అవకాశాలు కల్పించిన అనంతరం మెరిట్‌ ఆధారంగా రిక్రూట్‌మెంట్‌ నిర్వహించాలనే వాదన వినిపిస్తోంది. దీనిపై పీజీలు పలుమార్లు సూపరింటెండెంట్‌ను కలిసి రాష్ట్రంలోని ఇతర జిల్లాల రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియల కాపీలను చూపించినప్పటికీ అప్‌డేట్‌ గాకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఇదేతరహా ధోరణిలోనే ఈనెల 18న మెడికల్‌ ఎమర్జెన్సీ మెడికల్‌ కోర్సు పూర్తి చేసిన పీజీలను కాదని, బిఎస్‌సి డిడ్రీ కోర్సు ఆధారిత మెడికల్‌ ఎమర్జెన్సీ మెడికల్‌ సర్వీస్‌ పూర్తి చేసిన ముగ్గురికి అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇవ్వనుండడంపై ఆందోళన నెలకొంది.మరోసారి నోటిఫికేషన్‌ పరిశీలన నోటిఫికేషన్‌ ఆధారంగా ఇఎంటి పోస్టింగ్స్‌ భర్తీ చేస్తాం. గత ఫిబ్ర వరిలో విడుదల చేసిన పాత నోటిఫికేషన్‌ ఆధారంగా భర్తీ ప్రక్రియ కొలిక్కి వచ్చిన మాట వాస్తవమే. తాజాగా మరోసారి నోటిఫికేషన్‌ పరిశీలన చేసిన అనంతరం పోస్టింగులను భర్తీ చేస్తాం. -కె.రమాదేవి, సూపరింటెండెంట్‌, ప్రభుత్వ సర్వజనాస్పత్రి, కడప.

➡️