ఓటుహక్కును వినియోగించుకోవడం మన బాధ్యత

ప్రజాశక్తి-కడప అర్బన్‌ ప్రజాస్వామ్య దేశంలో విలువైన ఓటుహక్కును వినియోగించుకోవడం పౌరులుగా మన బాధ్యత అని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల కంట్రోల్‌ రూమ్‌ ప్రత్యేక పర్యవేక్షకులు, కడప నగర కమిషనర్‌ జి.ఎస్‌.ఎస్‌. ప్రవీణ్‌ చంద్‌ పేర్కొ న్నారు. శనివారం సాయంత్రం ‘మన ఓటు, మన ధైర్యం, మన భవిత’ అనే నినాదంతో కడప నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై ఓటర్లకు అవగాహన కల్పించే బైక్‌ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటు హక్కు విలువను చాటి చెప్పేందుకు, కొత్త ఓటర్లను ప్రోత్సహించడంతో పాటు ఓటింగ్‌ నమోదు ప్రక్రి యను మరింత సులభతరం చేయడమే కార్యక్రమం ఉద్దేశం అన్నారు. ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియో గించి ప్రజాస్వామ్య బలోపేతానికి సహకరించాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారంతా ఓటు హక్కును పొంది, బాధ్యతగా ఓటు హక్కుని వినియోగి ంచుకోవాలన్నారు. ప్రతి ఎన్నికల్లో కూడా అమూల్యమైన, విలువైన ఓటుహక్కును సద్వినియోగించుకుని.. ప్రజా స్వామ్య దేశంలో పటిష్టమైన నాయకులను ఎన్నుకోవాలని యువ ఓటర్లకు ఆయన సందేశం ఇచ్చారు. జిల్లాలో ప్రస్తుతం 16.39 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారని వీరంతా ఓటును తమ హక్కుగా గుర్తించడంతో పాటు బాధ్యతగా భావించాలన్నారు. అర్హత ఉన్న వారంతా కచ్చితంగా అవగాహనతో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం ద్వారా . పటిష్ట మైన నాయకున్ని ఎన్నుకున్న వారవుతార న్నారు. గత శాసన సభా ఎన్నికలకు జిల్లాలో 70 శాతం పైగా వోటింగ్‌ శాతం నమోదు కావడం శుభపరిణామం అన్నారు. రాబోయే ఎన్నికల్లో జిల్లాలో వందశాతం ఓటింగ్‌ నమోదయ్యేలా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లను కోరారు.

➡️