పారిశ్రామిక హబ్‌గా చేస్తా

May 10,2024 20:46

ప్రజాశక్తి – పూసపాటిరేగ: గెలిచిన వెంటనే ఈ ప్రాంతానికి పరిశ్రమలు తీసుకువచ్చి పారిశ్రామిక హబ్‌గా మార్చేస్తానని నెల్లిమర్ల నియోజకవర్గం కూటమి అభ్యర్ధి లోకం మాధవి అన్నారు. మండలంలోని కుమిలి, బొర్రవానిపాలెం, రెల్లివలస గ్రామాల్లో శుక్రవారం ఆమె ప్రచారం చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ త్వరలోనే విమానాశ్రయం, రామతీర్ధ సాగర్‌ పూర్తి అయి ఈ ప్రాంతమంతా అభివృద్ధి పధంలో నడుస్తుందన్నారు. సేవ చేయడానికే రాజకీయాల్లో వచ్చానని, తనకు డబ్బుపై వ్యామోహం లేదని ఒక్క అవకాశం ఇవ్వాలాని కోరారు. ఇంటింటి తిరిగి సూపర్‌ సిక్స్‌ను వివరించారు. సూపర్‌ సిక్స్‌ పథకాలతో పేదలు అభ్యున్నతికి ఎంతో ఉపయోగం అన్నారు. ఆమెతో ప్రచారంలో టిడిపి మండల అధ్యక్షలు మహంతి శంకరావు, రాష్ట్ర కార్యదర్శి మహంతి చిన్నంనాయుడు, దల్లి ముత్తాల రెడ్డి, ఆకిరి ప్రసాదరావు, పిన్నింటి సన్యాసినాయుడు, మద్దిల మురళీ, పతివాడ శ్రీను తదితరులు పాల్గొన్నారు.నెల్లిమర్ల: అధికార వైసిపి పాలనపై ప్రజలు విసిగిపోయారని మార్పును కోరి ఎన్‌డిఎ కూటమిని గెలిపిస్తారని టిడిపి, జనసేన ఉమ్మడి అభ్యర్ధి లోకం నాగ మాధవి ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం నగర పంచాయతీలో టిడిపి పార్లమెంటు మహిళా అధ్యక్షులు సువ్వాడ వనజాక్షి ఆధ్వర్యంలో మహిళా సాధికార సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి రాక్షస పాలనకు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. వైసిపి తాను విదేశాలకు వెళ్ళిపోతానని అసత్య ప్రచారం చేస్తున్నారని తాను ఎల్లప్పుడూ ప్రజలకు అండగా నిలిచి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా తనను, ఎమ్‌పిగా కలిశెట్టి అప్పల నాయుడును గెలిపించాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో టిడిపి నియోజకవర్గం ఇంఛార్జి కర్రోతు బంగార్రాజు, టిడిపి రాష్ట్ర పరిశీలకులు సువ్వాడ రవిశేఖర్‌, మండల అధ్యక్షులు కడగల ఆనంద్‌ కుమార్‌, జిల్లా అధికార ప్రతినిధి గేదెల రాజారావు, లెంక అప్పల నాయుడు, పోతల రాజప్పన్న, అవనాపు సత్య నారాయణ, నల్లం శ్రీను, కాళ్ళ రాజ శేఖర్‌, జన సేన మహిళా నేత బంగారు సరోజినీ, పాల్గొన్నారు.భోగాపురంలో ఎటువంటి అభివృద్దీ లేదుభోగాపురం: భోగాపురం పంచాయతీలో ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఎటువంటి అభివృద్ధి చేయలేదని కూటమి అభ్యర్థి లోకం మాధవి అన్నారు. భోగాపురం, చాకివలసలో ఎమ్‌పి అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భోగాపురం గ్రామ ప్రజలంతా బట్టి కాలువతో నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తన సొంత సొమ్ముతో బాగు చేస్తానని పంచాయతీకి అనుమతి కోరితే ఎమ్మెల్యే అడ్డుకున్నారని గుర్తు చేశారు. ఎమ్‌పి అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందన్నారు. టిడిపి నియోజకవర్గ ఇంఛార్జి కర్రోతు బంగార్రాజు మాట్లాడుతూ తాను ఎంపిపిగా చేసిన సమయంలో భోగాపురంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో కాకర్లపూడి శ్రీనివాసరాజు, నాయకులు మట్టా అయ్యప్ప రెడ్డి, వరుపుల సుధాకర్‌, డిలక్ష్మణ్‌ రెడ్డి, బొడ్డ హరిబాబు, రవణ, పల్లంట్ల జగదీష్‌, పళ్ళ రాంబాబు, ఉండకు సూరిబాబు, నానాజీ తదితరులు పాల్గొన్నారు.

➡️