ఓటు అడిగే హక్కు జగన్ కు లేదు

Jan 28,2024 16:15 #press meet, #TDP, #Vizianagaram
  • ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు

ప్రజాశక్తి-విజయనగరం కోట : సిఎం జగన్ కు ప్రజలను ఓటు అడిగే హక్కు లేదని విజయనగరం టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు. ఆదివారం  విజయనగరం అశోక్ బంగ్లా టిడిపి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైసిపి నాయకులు శనివారం నిర్వహించిన భీమిలి ఎన్నికల శంకారావసభలో ఈ రాష్ట్రంలో ప్రజానీకం అందరూ మాకే ఓటు వేయాలనుకుంటున్నారని అన్నారు మాకు ఇంటికో సైనికులు ఉన్నారన్నారని ఈ ప్రభుత్వం ఉంటుందని అన్నారు. ప్రజలు ఆ పరిస్థితుల్లో లేరు జగన్మోహన్ రెడ్డిని అధికారం నుండి దించాలని ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయిపోయారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఈ రాష్ట్రం అన్ని విధాల సర్వనాశనం అయిందని అన్నారు. గ్రామీణ పట్టణ ప్రజల రెక్కలు విరిగిపోయాయని అన్నారు . ఎన్నికల సమయంలో మద్యనిషేధం చేస్తానని హామీ ఇచ్చి మద్యాన్ని ఇప్పుడు పదింతలు రేట్లు పెంచి ఆ మద్యం ద్వారా ప్రజల అనారోగ్యం జోబికి హార్ట్ కి చిల్లులు వేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ఈనాడు లేనివిధంగా గ్రామాల్లోకి స్కూలులోకి గంజాయి చొరబడుతుందంటే ఈ రాష్ట్ర పరిపాలన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. దీన్ని అనడానికి అధికార యంత్రాంగాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలో ఆ విధంగా వినియోగించుకోలేదని అన్నారు. రాష్ట్రంలో ఉపాధి లు కంపెనీలు లేక నిరుద్యోగ యువత ఎక్కువైపోయారన్నారు. విజయనగరం నియోజకవర్గాల్లో మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయారన్నారు. అందువలన ఈ రాష్ట్రంలో ప్రజలు నీకెందుకు ఓటు వేయాలని అనుకుంటున్నారని అన్నారు. ఈ రాష్ట్రంలో ఆరుగురు ఎమ్మెల్యేలు నలుగురు ఎంపీలు వారి మాటలకు ఓటుకు విలువ లేదని విడిపోయారన్నారు. ప్రస్తుత నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలను ఎంపీలను మార్చుతున్నారంటే క్షేత్రస్థాయిలో ఉన్న ఎమ్మెల్యేలు ఫెయిల్ అయితే మీరు ఫెయిల్ అయినట్టు కాదా అని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో మీ పార్టీని ప్రజలు బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. విజయనగరం నియోజకవర్గ ఇన్చార్జి అతిథి గజపతిరాజు మాట్లాడుతూ ప్రజలు మీ వైసీపీ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా లేరన్నారు ఈ రోజు రాష్ట్రంలో సామాన్య ప్రజలు నిత్యవసర సరుకులు కొనలేక నానా అవస్థలు పడుతున్నారని అన్నారు. కరెంట్ బిల్లు షాక్ కొడుతుంటే మరోపక్క ఆస్తి పన్ను 30 శాతం పెంచారు.. పెట్రోల్ డీజిల్ వంటి వాటిపై కూడా విపరీతమైన దారాలు మోపి ప్రజలు లడ్డు విరుస్తున్నారన్నారు రైతుల ఆత్మహత్యలు చేసుకోవడంలో రాష్ట్ర మూడవ స్థానంలో ఉంది మహిళ ఆత్మహత్యలో ఐదవ స్థానంలో ఉంది అని మండిపడ్డారు. ఎంతకంటే ఇంకేం కావాలి మీ వైసీపీ ప్రభుత్వం విఫలమైందని చెప్పడానికి అందువలన ప్రజలు మీకెందుకు ఓటు వేయాలని అనుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్ మండల పార్టీ అధ్యక్షులు బొద్దుల నర్సింగరావు , గంటా పోలినాయుడు, రాష్ట్ర బీసీ నాయకులు కంది మురళి నాయుడు, వేచలపు శ్రీనివాసరావు, కనకల మురళీమోహన్, మాడుగుల నియోజకవర్గ పరిశీలకులు నర్సింగ్ రావు, విజ్జపు ప్రసాద్, విజయనగరం నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

➡️