వరి నాట్లుతో జగన్‌ చిత్ర పటం

Dec 21,2023 17:01 #East Godavari
  • వినూత్నంగా సీఎం జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు

ప్రజాశక్తి-కడియం(తూర్పుగోదావరి) : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి 51వ పుట్టినరోజు వేడుకలను వైసిపి రాష్ట్ర కార్యదర్శి పెద్దాపురం నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు గిరజాల వీర్రాజు (బాబు) కడియం రైతులతో కలిసి ఘనంగా నిర్వహించారు. రైతులు పార్టీ శ్రేణులుతో వరి నాట్లుతో జగన్‌ చిత్ర పటాన్ని తీర్చి దిద్దారు. అనంతరం భారీ కేక్‌ కట్‌ చేసి సీఎం జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో కడియం మండలం పార్టీ అధ్యక్షులు సతీష్‌ చంద్ర స్టాలిన్‌, మండల వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ యీలి గోపాలం, సొసైటీ ఛైర్‌ పర్సన్‌లు తిరుమల శెట్టి శ్రీను, వెలుగుబంటి అచ్యుత్‌ రామ్‌, మాజీ సర్పంచ్‌ దాసరి శేషగిరి, పార్టీ నాయకులు శాకా పట్టాభి, బట్టు చిన్ని, కుసునూరి బాబులు, గుత్తుల వాసు, బొమ్మిరెడ్డి వెంకట్రావు, దోడ్డా బుజ్జి, లావేటి రమేష్‌, పూడి వీర బ్రహ్మం, పెంకే రామకృష్ణ, చిలుకూరు రామకృష్ణ, ఓగిరాల రాజు, కవల వెంకన్న, పున్నమరాజు వీర్రాజు, వంగపండు ప్రసాద్‌, బొమ్మిరెడ్డి శ్రీను, మలకల దొరబాబు, నదం విజరు, తదితరులు పాల్గొన్నారు.

➡️