పలుచోట్ల జగ్జీవన్‌ రామ్‌ జయంతి

Apr 5,2024 20:59

ప్రజాశక్తి పార్వతీపురం టౌన్‌ :  భారత అమూల్య రత్న జగ్జీవన్‌ రామ్‌ అంటరాని వారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దళిత చిహ్నమని స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. శుక్రవారం జగ్జీవన్‌రామ్‌ 117వ జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని ప్రధాన రహదారిపై గల జగ్జీవన్‌ రామ్‌ విగ్రహానికి ప్రజా ప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు, ఉద్యోగులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 33ఏళ్లకు పైగా కేంద్ర కేబినెట్‌ మంత్రిగా, దేశ ఉప ప్రధాన మంత్రిగానూ డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ తీసుకున్న అసంఖ్యాక నిర్ణయాలు, దేశంలోని పేదలు, శ్రామిక ప్రజలు, సగటు మనుషులు, వెనుకబడిన వర్గాలు, ముఖ్యంగా షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు, వారి హక్కులు, అభివృద్ధికి జగ్జీవన్‌రామ్‌ తీవ్రంగా కృషి చేశారన్నారు. కార్యక్రమంలో పట్టణ వైసిపి అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ, పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ మంత్రి రవికుమార్‌, జెసిఎస్‌ కన్వీనర్‌ గొర్లి మాధవరావు, స్టేట్‌ డైరెక్టర్‌ జాన్నాడ శ్రీదేవి, జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షులు సర్విశెట్టి శ్రీనివాసరావు, మాదిగ ఫెడరేషన్‌ సంఘం సభ్యులు, వివిధ వార్డుల కౌన్సిలర్లు, సర్పంచ్లు, వైసిపి సీనియర్‌ నాయకులు, దళిత సంఘాల నాయకులు, జిల్లా మాదిగ సమైక్య సంఘం సభ్యులు, జెఎసి సభ్యులు, స్థానిక ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

వీరఘట్టం : భారత తొలి దళిత ఉప ప్రధాని బాబు జగజ్జీవన్‌ రామ్‌ జయంతి వేడుకలు మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని బాబు జగజ్జీవన్‌ రామ్‌ కాలనీలో బాబు జగజ్జీవన్‌రామ్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా దళిత నాయకులు ఎ.రాంకుమార్‌, ఎన్‌.జాకబ్‌ దయానంద్‌ మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్‌.శశిభూషణరావు, ఎన్‌.కల్యాణ్‌, ఎన్‌కె ప్రసాద్‌, ఎన్‌వి భాస్కరరావు, కె.పైడిరాజు, ఎన్‌ రిషి రోషన్‌, వి.ప్రశాంత్‌, జి.రామకృష్ణ, బి.అశోక్‌, వి.నెల్సన్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

పాలకొండ : ప్రజాసేవకుడు జగ్జీవన్‌రామ్‌ మహౌన్నత నాయకత్వం, వ్యక్తిత్వం, సేవ భావంభారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థకు, సంస్థకు మహాబలాన్ని చేకూర్చిపెట్టాయని దళిత సీనియర్‌ నాయకులు భోగి జేమ్స్‌ కుమార్‌ అన్నారు. పట్టణంలోని కస్పా వీధిలో జరిగిన డాక్టర్‌ బాబు జగజీవన్‌రావు 177వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రశ్రేణి నాయకుల్లో ఒకరని,భారత స్వాతంత్య్ర ఉద్యమం లోనూ, నవభారత నిర్మాణంలో ఉదాత్తమైన పాత్ర నిర్వహించిన బాబూ జగ్జీవన్‌ రామ్‌, చదువుకునే రోజుల్లో దళితుల సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారన్నారు. సమాజం దళిత జాతుల పట్ల అవలంభించే అంటరానితనం, వారికీ జరిగే అన్యాయాలకు, వ్యతిరేకంగా పోరాడారన్నారు. కార్యక్రమంలో దళిత యువ నాయకులు ఎందవ మరియాదాసు, పకీరు, భోగి దాసు, శ్రీదేవి, పారమ్మ, చిన్నమ్మడు, మహిళలు, యువకులు పిల్లలు పాల్గొన్నారు.

➡️