బేబినాయన గెలుపుతో ప్రజలకు న్యాయం

May 3,2024 21:22

ప్రజాశక్తి- బొబ్బిలి : టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయనకు మద్దతుగా జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరి ఆధ్వర్యాన శుక్రవారం పట్టణంలో సైకిల్‌ర్యాలీ చేపట్టారు. వేణుగోపాల స్వామి ఆలయం వద్ద ప్రారంభించి, 5, 7, 8, 9 వార్డుల్లో ర్యాలీ కొనసాగింది. బేబినాయన గెలుపునకు జనసైనికులు పని చేయాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి గిరడ అప్పలస్వామి కోరారు. జనసేన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నిరంతరం ప్రజల కోసం పని చేస్తున్న బేబినాయనను గెలిపించుకోవాలన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు లంక రమేష్‌, నాగు, జనసైనికులు పాల్గొన్నారు. రామభద్రపురం: ఆంద్రప్రదేశ్‌ అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాలంటే టిడిపి, జనసేన, బిజెపి కూటమి విజయం సాధించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జనసేన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పాలూరి బాబు, టిడిపి జిల్లా బీసీ సెల్‌ ఉపాధ్యక్షులు కర్రోతు తిరుపతిరావులు అన్నారు. మండల కేంద్రంలో వారు శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ వైసిపి పాలనలో రాష్ట్రం అన్నిరంగాల్లో వెనుకబడి పోయిందన్నారు. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందన్నారు. రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సరైన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బొబ్బిలి అసెంబ్లీ అభ్యర్థి బేబీనాయన, ఎమ్‌పి అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడులకు సైకిల్‌ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

➡️