గొబ్బెమ్మ ఆటతో అంగన్వాడీల నిరసన

Jan 11,2024 21:16

దువ్వూరు : మండల కేంద్రమైన స్థానిక ప్రభుత్వ సముదాయాల ఎదుట వినూత్న రీతిలో జగన్‌ ఫొటో పెట్టుకుని అంగన్వాడీ కార్యకర్తలు గొబ్బెమ్మలు ఆట ఆడి తమ నిరసనను వ్యక్తం చేశారు ఇప్పటికైనా వతమమీద కరుణించి రావాల్సిన సదుపాయాలు వెంటనే తీర్చాలని నినాదాలుచేశారు. 31 రోజుగా వివిధ రూపాలలో ఆందోళన చేసినా ఇంతవరకు ప్రభుత్వంలో చలనం లేదని వాపోయారు. జమ్మలమడుగు : రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమ్మెను అణచివేసేందుకు నోటీసులు ఇచ్చి సమ్మెను ఆపాలని ప్రయత్నం చేస్తుందని, తాము నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని, తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు సమ్మెను ఆపేది లేదని జమ్మలమడుగు ఐసిడిఎస్‌ ప్రాజెక్టు అంగన్వాడి యూనియన్‌( సిఐటియు) నాయకులు భాగ్యమ్మ, లక్ష్మీదేవి పేర్కొన్నారు. గురువారం జమ్మలమడుగు పట్టణంలోని ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో 31 రోజుకు చేరడంతో కుర్చీలను తలపై పెట్టుకుని వినూత్న రీతిలో అంగన్వాడీలు నిరసన చేపట్టారు. కార్యక్రమంలో జమ్మలమడుగు సిఐటియు పట్టణ కార్యదర్శి దాసరి విజరు, సిపిఎం పట్టణ కార్యదర్శి యేసుదాసు, ఎస్‌ఎఫ్‌ఐ,డివైఎఫ్‌ఐ బాధ్యులు వినరు కుమార్‌, సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్‌, నరసమ్మ,కులాయమ్మ, అంగన్వాడీలు పాల్గొన్నారు. కడప అర్బన్‌ : అంగన్వాడీల సమ్మెలో భాగంగా గురువారం కలెక్టరేట్‌ చేపట్టిన రిలే దీక్షలు గురువారం నాటికి ఆరవ రోజుకు చేరుకున్నాయి. సమ్మె 31వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి. మనోహర్‌, ఎఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగ సుబ్బారెడ్డి అంగన్వాడి నాయకులు బి.లక్ష్మీదేవి, మంజుల మాట్లాడుతూ చిన్నపిల్లలకు విద్యాబుద్ధి నేర్పించి వారికి చదువు పైన అభిరుచి కలిగించే విధంగా అంగన్వాడీలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు కనీస వేతనాలు ఇవ్వకుండా వారి చేస్తున్న సమ్మెపై ఎస్మా చట్టం జీవో నంబర్‌ 2 విడుదల చేసి సమ్మెను అణచివేయాలని చూడడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీల నాయకులతో చర్చలు జరిపి కనీస వేతనం పెంచి, గ్రాటివిటీ అమలు చేయాలని తమ డిమాండ్ల సాధించేవరకు సమ్మె కొనసాగిస్తామన్నారు. సంఘీభావంగా యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి రాజా, సిఐటియు జిల్లా అధ్యక్షులు కామనూరు శ్రీనివాస్‌ రెడ్డి, ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి ఉద్దే మదిలేటి డివైఎఫ్‌ఐ డిఎం ఓబులేసు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సునీల్‌ కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్‌ నాయకులు ఎంపీ అంజలీదేవి, దీప, వినీల సిఐటియు నాయకులు పవన్‌, ఉదరు పాల్గొన్నారు. అంగన్వాడీలను అడ్డుకున్న పోలీసులు సఫాయి కర్మచారి కమిషన్‌ సభ్యులు పి.పి. వావా. కడప కలెక్టరేట్లో సమావేశానికి హాజరయ్యారు. గురువారం అంగన్వాడీలు ఆయనను కలిసి ఎందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. చివరకు సిఐటియు నగర జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్‌ను సమావేశ హాలుకు అనుమతించారు. చాపాడు : తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీలు గురువారం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తల మండల నాయకురాలు సుజాత మాటా ్లడుతూ ప్రభుత్వం అంగ న్వాడీల పట్ల చిన్నచూపు చూ స్తుందన్నారు. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని సామరస్యంగా నిరసన తెలి యజేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకుండా బెదిరిం పులకు దిగుతోందన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. మైదుకూరు : రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో విఫలమైందని అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా గురువారం మైదు కూరు సిడిపిఒ కార్యాలయం ముందు నిరాహార దీక్షను చేశారు కార్యక్ర మంలోధనలక్ష్మి, భారతి చెన్నమ్మ, రిజ్వాన, అనురాధ, శ్యామల, సాయి లక్ష్మి, రామతులసి, లతా, రాధా, రమాదేవి, లక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు ప్రశాంతి, వెంకటసుబ్బమ్మ, రామసంజమ్మ, వేదమ్మ, మహాలక్ష్మి, సిద్దేశ్వరి, వసుమతి, పుష్పలత, పద్మావతి, భాగ్యలక్ష్మి, హబిబ్‌, శోభ పాల్గొన్నారు. షోకాజ్‌ నోటీసులు అందజేత.. నెల రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు చేస్తున్న నిరవధిక సమ్మె కారణంగా అ తమ విధులకు హాజరు కాలేదంటూ ఐసి డిఎస్‌ ఉన్నతాధికారులు షోకాజ్‌ నోటీసులను అంద జేశారు. మైదుకూరు ఐస ిడిఎస్‌ ప్రాజెక్టు పరిధిల రెండు రోజులుగా ఐసిడిఎస్‌ సూప ర్‌వైజర్లు, మహిళా పోలీసులు నోటీసులను అంగ న్వాడీ కేంద్రాలకు అతికి ంచారు. ఎర్రగుంట్ల : అంగన్వాడీల వేతనాలు పెంచాలని నిరసనలు తెలుపుతున్న వారిపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం దారుణమని సిపిఎం సీనియర్‌ నాయకులు బయన్న తెలిపారు. స్థానిక తహశీ ల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న అంగన్వాడీ కార్యకర్తలకు మద్దతుగా గురువారం సిపిఎం సీనియర్‌ నాయకులు బయన్న నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. నెల రోజులుగా నిరసనలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారు ణమని అన్నారు. ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్‌) : స్థానిక తహశీల్దార్‌ కార్యా లయం వద్ద గురువారం రిలే దీక్షలు చేపట్టారు. ముందుగా ప్రభుత్వ దిష్టిబొమ్మను తహ శీల్దార్‌ కార్యాలయం నుంచి ర్యాలీగా తీసుకెళ్లి శివాలయం సర్కిల్లో దహనం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. కార్యక్ర మంలో సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, ఐద్వా నాయకురాలు ముంతాజ్‌ బేగం, అంగన్వాడీ యూనియన్‌ కార్యదర్శి సుబ్బలక్ష్మి, పద్మ, విజయ, సువార్తమ్మ, రాజీ, రాణి, గురుదేవి, శివమ్మ, సునీత, అర్బన్‌ సెంటర్ల అంగన్వాడీలు పాల్గొన్నారు.

➡️