తులసిరెడ్డితో వివేకా కుమార్తె, అల్లుడు భేటీ

ప్రజాశక్తి – వేంపల్లె
పిసిసి మీడియా చైర్మన్‌ ఎన్‌.తులసిరెడ్డిని శనివారం మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్‌ డాక్టర్‌ సునీతమ్మ, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి భేటీ అయ్యారు. కడప నుండి పులివెందులకు వెళుతూ వారు తులసిరెడ్డి ఇంటికెళ్లారు. మర్యాదపూర్వకంగానే సునీతమ్మ, నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి కలిశారు. వీరిని తులసిరెడ్డి సన్మానించారు. దాదాపు గంటసేపు తులసిరెడ్డితో ఏకాంతంగా రాజకీయ విషయాలపై చర్చించారు. వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కూడా చర్చించినట్లు సమాచారం. ఎన్నికల ప్రచార సమయంలో వివేకానందరెడ్డి హత్య జరిగిన తీరుపై ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే దానిపై చర్చించినట్లు తెలిసింది. వివేకా కుమార్తె కాంగ్రెస్‌ పార్టీ వైపే ఉండేలా చర్చిం చినట్లు సమాచారం. పులివెందుల అసెంబ్లీ స్థానానికి పోటీ చేసే విషయం చర్చినట్లు తెలిసింది. అనంతరం డాక్టర్‌ సునీతమ్మకు కాంగ్రెస్‌ నాయకులను తులసిరెడ్డి పరిచయం చేశారు. కార్యక్ర మంలో కాంగ్రెస్‌ నాయకులు ధృవకుమార్‌రెడ్డి, రాజా, బాలం సుబ్బరాయుడు, మాస్‌, అమర్‌, వెంకటేష్‌, ఉత్తన్న పాల్గొన్నారు.

➡️