ప్రజలు ఆశీర్వదిస్తున్నారు

ప్రజాశక్తి – కడప అర్బన్‌ తెలుగుదేశం పార్టీని ప్రజలు ఎక్కడికి వెళ్లినా ఆశీర్వదిస్తూ ఉన్నారని టిడిపి కార్పోరేటర్‌ ఉమాదేవి అన్నారు. శనివారం ‘బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా 15వ డివిజన్లు మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2024లో వచ్చేది టిడిపి ప్రభుత్వమే అని, ప్రజల నుంచి వస్తున్న స్పందనబట్టి స్పష్టంగా తెలుస్తుంది అన్నారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారని పేర్కొన్నారు. చేతికి వచ్చిన పంట నోటి వరకు రాలేదని రైతులు ఆవేదన చెందారని తెలిపారు. వైసిపి ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవడంలో విఫలమైందని విమర్శించారు. టిడిపి సీనియర్‌ నాయకుడు లక్ష్మిరెడ్డి, కడప నియోజకవర్గ మాజీ ఇంచార్జి అమీర్‌ బాబు, సింగిల్‌ విండో మాజీ అధ్యక్షులు మన్మోహన్‌ రెడ్డి, దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ చంద్రబాబు ఎప్పుడెప్పుడు సీఎం అవుతారని ప్రజలు ఎదురుచూస్తూ ఉన్నారని చెప్పారు. జిల్లాలో పదికి పది సీట్లు సాధించే దిశగా పార్టీ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. తుపాను వల్ల లక్షలాది ఎకరాల్లో రైతులు పంట నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు మూడు రోజులుగా వరద ప్రాంతాల్లో పర్యటించి ఓదార్చారని తెలిపారు. సిఎం జగన్మోహన్‌ రెడ్డికి ఉల్లిపాయలు, ఉల్లగడ్డలు తేడా తెలియని పరిస్థితిలో ఉన్నారని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయో అని ప్రజలు ఎదురుచూస్తూ ఉన్నారని పేర్కొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర అభివద్ధి చెందుతుందని ప్రజలు తెలుసుకున్నారని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు సమస్యలతో అల్లాడుతూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో గుంతల రోడ్ల వల్ల ప్రజల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మేయరు, కార్పొరేటర్లు, అధికారంలో వైసిపి ఉన్న జిల్లాను అభివద్ధి చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఆమూరి బాలదాసు, కొండా సుబ్బయ్య, నబీకోట శీను, నజీర్‌, జయరామిరెడ్డి, ఓబుల్‌ రెడ్డి, బిసి సెల్‌ నగర ప్రధాన కార్యదర్శి అశోక్‌ కుమార్‌, అంబవరం రామాంజనేయులు రెడ్డి, ఇలియాస్‌, గౌస్‌ పీర్‌, మురళి, సుధాకర్‌ రెడ్డి వెంకటేష్‌, మీనాక్షి, స్వర్ణలత, మల్లేశ్వరి, అమరావతి పాల్గొన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఉమాదేవి

➡️