భూకబ్జాలు అరికట్టాలని ధర్నా

ప్రజాశక్తి – కడప అర్బన్‌ పోరుమామిళ్ల మండలం రంగసముద్రం పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంటున్న భూకబ్జాలను అరికట్టాలని 15 ఏళ్ల కిందట సిపిఎం ఆధ్వర్యంలో పేదలు భూ పోరాటం చేసి నిర్మించుకున్న కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి.మనోహర్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట పోరుమామిళ్ల నిర్వాసితులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మౌలిక వసతులు కల్పించకుండా పాలకులు అధికారులు. తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. 15 సంవత్సరాల కిందట వేసుకున్న వారికి అందరికీ ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని పేర్కొన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో వేసుకున్న కాలనీలలో మండల స్థాయి అధికారులు, విఆర్‌ఒలు, సర్వేయర్‌ అక్కడ ఉన్నటువంటి పేదలను బయటకు పంపించే పనిలో ఉన్నారని చెప్పారు. పట్టాలు రావని బెదిరింపు ధోరణితో అధికారులు పనిచేస్తున్నారని విమ ర్శించారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా అధికారులు వ్యవహరించడం దుర్మార్గమని పేర్కొన్నారు. పేదలు వేసుకున్న అందరికీ ఇళ్ల స్థలాలు, పక్కాగృహాల మంజూరు చేయకపోతే ఆందోళన, పోరాటాలకు శ్రీకారం చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పోరుమామిళ్ల మండల సిపిఎం కార్యదర్శి భైరవ ప్రసాద్‌, స్థానిక నాయకులు ఇళ్ల స్థలాల బాధితులు పాల్గొన్నారు. ఇంటి పట్టాలు మంజూరు చేయాలి బద్వేలు : బద్వేల్‌ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పేదలు ఇంటి అద్దె కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని, నివాసముంటున్న వారికి ఇంటి పట్టాలు మంజూరు చేయాలని సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో విద్యానగర్‌, పూసలవాడ సచివాలయాల వద్ద సోమవారం పేదలతో కలిసి ఆందోళన నిర్వ హించారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ నాయకులు ముడియం చిన్ని మా ట్లాడుతూ పట్టణంలోని పేదలు సుందరయ్య కాలనీ, పూసలవాడ, జ్యోతిబసు కాలనీ, ఐలమ్మ కాలనీ, మహమ్మద్‌ కాలనీల్లో బాడుగలు కట్టలేక చాలీచాలని కూలితో జీవనం సాగిస్తున్నారని చెప్పారు. వారికి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. పట్టణంలో ప్రభుత్వ స్థలాలు భూకబ్జా దారుల చేతుల్లో ఉన్నాయని, వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రభుత్వం స్పందించి స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని కోరారు. అనం తరం ప్రజలు అర్జీలను సచివాలయ సిబ్బందికి అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు గంగనపల్లి నాగార్జున, ఆంజనేయులు, బాల గురయ్య, రాయప్ప, రాజగోపాల్‌, అనంతమ్మ, బాలమ్మ మోక్షమ్మ, కైరున్‌బి, మస్తాన్‌ బి, ఫాతిమా, నాగమ్మ, గంప సుబ్బరాయుడు, ముస్తఫా, రాయప్ప, పాల్గొన్నారు.

➡️