దారుణం

Jun 27,2024 21:34 #దారుణం

ఆస్తికోసం తల్లిదండ్రులను కడ తేర్చినకసాయి కొడుకు, కోడలు
విషద్రావణం ఇచ్చి దారుణానికి ఒడిగట్టిన వైనం
ప్రజాశక్తి-వీరబల్లి
బిడ్డలను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి వారికి మంచి భవిష్యత్‌ను చూపించిన తల్లిదండ్రులకు చివరకు విషాదమే మిగలింది. ఆస్తి కోసం వృద్ధ తల్లిదండ్రులనే కడ తేర్చారు కుమారుడు, కోడలు. తమ ఆస్తిలో సగం మృతిచెందిన పెద్దకుమారుడు పిల్లలకు రాయిస్తానన్న పాపానికి దారుణానికి ఒడిగట్టారు. విషద్రావణం వారిచే బలవంతంగా తాపించి చంపారు. ఈ హృదయ విషాదకర ఘటన అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం గుర్రప్పగారిపల్లె పంచాయతీ కొత్త వడ్డెపల్లిలో గురువారం చోటు చేసుకుంది. ఈ సంఘటన మండలంలో కలకలం రేపింది. బంధువుల, స్థానికుల, పోలీసుల, కథనం మేరకు… కొత్తవడ్డేపల్లికి చెందిన ఉప్పు తోళ్ల చిన్న నాగ సుబ్బన్న (79) ఉప్పు తోళ్ల నాగమ్మ (75)కు ఇద్దరు కుమారులు, వీరిలో పెద్ద కుమారుడు, భార్య ఇద్దరు మృతిచెందారు. వారికి ఇద్దరు సంతానం. ప్రస్తుతం వృద్ధ తల్లిదండ్రులు చిన్న కుమారుడు ఉప్పుతోళ్ల రమణయ్య, కోడులు కళావతి వద్ద ఉంటున్నారు. వీరి మధ్య తరచూ ఆస్తి గొడవులు జరుగుతూ ఉండేవి. పెద్ద కుమారుడు పిల్లలకు తనకున్న 10 ఎకరాలలో సగం రాసి ఇస్తానని తల్లిదండ్రులు చెప్పారు. దాంతో వారిపై ఆగ్రహించిన చిన్న కుమారుడు రమణయ్య, కళావతిలు ఇరువురు కలిసి గురువారం ఉదయం ముష్టి చెక్క బెల్లం నూరి వారిని తినేలా చేశారు. అది తిన్న నాగ సుబ్బన్న, నాగమ్మలు ప్రాణాపాయ స్థితిలో ఉండగా 108 వాహనానికి సమాచారం ఇచ్చి రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ముందుగా నాగమ్మ మతి చెందారు. అనంతరం చిన్న నాగ సుబ్బన్న కూడా మతి చెందారు. మతికి కారణం చిన్న కుమారుడు, కోడలేనని పోలీసుల ఎదుట వాపోయారు. ఇరువురు వద్ధులు కావడం, ఒకేసారి మతి చెందడంతో వారి బంధువులు, స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని కన్నీ మున్నీరు రోధించారు. వద్ధుల మతికి కారుకులైన రమణయ్యను, కళావతిని శిక్షించాలని కోరారు. ఈ విషయమై సిఐ తులసి రామ్‌, ఎఎస్‌ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

➡️