వాలంటీర్‌ వ్యవస్థ ఆదర్శనీయం – ఉప ముఖ్యమంత్రి ఎస్‌.బి అంజాద్‌బాషా

ప్రజాశక్తి – కడప గ్రామ, వార్డు సచివాలయ సేవలతో ప్రభుత్వ పరిపాలనలో నూతన వరవడి సష్టించిందని ఉప ముఖ్యమంత్రి ఎస్‌.బి అంజాద్‌ బాషాఅన్నారు. సోమవారం స్థానిక మున్సిపల్‌ గ్రౌండ్‌లో మున్సిపల్‌ పరిధిలోని వార్డులకు సంబంధించి సచివాలయ వార్డు వాలంటీర్ల సేవా పురస్కారాల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఉప ముఖ ్యమంత్రి ఎస్‌.బి అంజాద్‌బాషా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను మన రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్లు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజల గడపకు చేరుస్తున్న మానవతా మూర్తులు వాలంటీర్లని కొనియాడారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను కుల, మత,పార్టీ లకతీతంగా ప్రతిభ చూపిన వాలంటీర్లను గుర్తించిన ప్రభుత్వం సేవా మిత్ర, సేవ రత్న, సేవా వజ్ర పేర్లతో సత్కరిస్తోందన్నారు. నగర డిప్యూటీ మేయర్స్‌ బండి నిత్యానందరెడ్డి, ముంతాజ్‌ బేగం లు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజలకు సేవలందించడంలో ప్రతిభ చూపిన ఆయా వార్డు లకు సంబం ధించి ఐదుగురికి సేవ వజ్ర, 15 మందికి సేవా రత్న 1596 మంది వాలంటీర్లను అభినందిస్తూ సేవా మిత్ర పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ రాకేష్‌ చంద్ర, కార్పొరేటర్లు మార్కెట్‌ యార్డు వైస్‌ ఛైర్మన్‌ ఇబ్రహీం మియా, వైసిపి నాయ కులు ఎస్‌. బి. అహమ్మద్‌ బాషా, ఆఫ్జల్‌ ఖాన్‌, నారపురెడ్డి సుబ్బారెడ్డి, వార్డు సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లు, అధికారులు పాల్గొన్నారు.

➡️