ఎస్మా జీవో ప్రతులను దగ్ధం చేసిన అంగన్వాడీలు

Jan 8,2024 15:26 #Kadapa
anganwadi workers strike 28th day kadapa

ప్రజాశక్తి – వేంపల్లె :  అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఎస్మా జీవో 2 ప్రతులను అంగన్వాడీలు దగ్ధం చేశారు. అంగన్వాడీలు చేస్తున్న సమ్మె సోమవారం 27వ రోజుకు చేరుకుంది. దీంతో స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ మహిళాలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఎస్మా జీవో ప్రతులను దగ్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వంపై, సిఎం జగన్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంగన్వాడీలపై ప్రయోగించిన ఎస్మాను రద్దు చేయక పోతే వైకాపా ప్రభుత్వాన్ని అంగన్వాడీలు ఇంటికి పంపిస్తారని అంగన్వాడీ సంఘాల నాయకురాలు సరస్వతి, లలితా, సావిత్రి, శైలజా, శాంత కుమారి, శ్యామలలు పేర్కొన్నారు. ఎస్మా ప్రయోగించిన తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెను ఆపేది లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో వేంపల్లె, చక్రాయపేట, వేముల మండలాల్లోని అంగన్వాడీల మహిళాలు పాల్గొన్నారు.

➡️