వరి పంట ఎండిపోకుండా పలు జాగ్రత్తలు

Jan 29,2024 15:09 #Kadapa
awareness on paddy crop

పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు
ప్రజాశక్తి – చాపాడు : ప్రస్తుత సీజన్ లో రైతులు సాగు చేసిన వరి పంట ఎండకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని కడప కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త లు శ్రీనివాస ఆచారి, భగవతి ప్రియ సూచించారు. మండల పరిధిలోని పల్లవోలు, ఖాదరపల్లె ,సీతారామాపురం గ్రామాల పరిధిలో ఎండిపోతున్న వరి పంటలను వ్యవసాయ అధికారి మ్యాగీ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరి పంట ఎండిపోతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించామని వరి పొలాలలో రెండు సెంటీమీటర్ల వరకు నీటిని నిలువ ఉంచాలన్నారు. ఎట్టి పరిస్థితులలో నీటిని పూర్తిగా తీసివేయకూడదన్నారు. సత్వర నివారణకు చిలేటెడ్ జింక్ ను 2 గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి, పాలిసీడ్ 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి రెండు మూడు దఫాలుగా పిచికారి చేయాలన్నారు. అలాగే పంట పొలాల్లోని నీటిని పరీక్షల నిమిత్తం సేకరించి ల్యాబ్ కు తరలిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిఆర్సి డిడిఏ రమణారెడ్డి, ఎఫ్ టిసి ఏఓ పద్మజా, శివ శైలజ, మైదుకూరు డివిజన్ ఏడిఏ కృష్ణమూర్తి, విఏఏలు గోపి రామ్, గిరిధర్ రెడ్డి, సుబ్బరాయుడు రైతులు పాల్గొన్నారు.

➡️