శాస్త్రీయ దృక్పథం అవసరం : జెవివి

ప్రజాశక్తి – కడప అర్బన్‌ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచేందుకు సమ్మర్‌ క్యాంపులు ఎంతగానో ఉపయోగ పడుతాయని జెవివి రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.డి. దేవదత్తం పేర్కొన్నారు. కడప నగరం రామకష్ణ నగర్‌లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహించేందుకు సన్నద్ధ సమావేశం ఉర్దూ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవిజ్ఞాన వేదిక ఆవిర్భావం నాటి సంఘటనల గురించి, జనవిజ్ఞాన వేదిక విద్యార్థుల కోసం చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు. ప్రతి సంవత్సరమూ చెకుముకి సైన్స్‌ టాలెంట్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరమూ జెవివి సమ్మర్‌ క్యాంపులు నిర్వహిస్తున్నామని చెప్పారు. వేసవి సమయంలో విద్యార్థులు తమ సమయాన్ని వధా చేసుకోకుండా విజ్ఞానం వినోదం తోకూడిన అంశాలు నేర్చుకోవడానికి ఈ సమ్మర్‌ క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. జెవివి నగర కమిటీ ప్రధాన కార్యదర్శి పైడికాల్వ కిరణ్‌ కుమార్‌ మాట్లాడుతూ కో-పరేటివ్‌ కాలనీలో 15 రోజులపాటు సమ్మర్‌ క్యాంపు నిర్వహించామని పేర్కొన్నారు. రామకష్ణ నగర్‌ ప్రాంతంలోని విద్యార్థులకు సమ్మర్‌ క్యాంపును నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందులో మ్యాజిక్‌, ఆటలు, పాటలు, ఓరిగామి, ఇంగ్లీషు గ్రామర్‌, ఈజీ మ్యాథ్స్‌, నీతికథలు నేర్పిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థిని, విద్యార్థులు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఈ సమ్మర్‌ క్యాంపును ఈనెల 20 నుంచి రామకష్ణ నగర్‌లోని ఉర్దూ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రోజూ ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు. సమావేశంలో జెవివి సీనియర్‌ నాయకులు వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ ట్రెజరర్‌ సమీర్‌ బాషా, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంజాద్‌ అలీ, పాఠశాల విద్యా కమిటీ సభ్యులు అబ్దుల్‌ , ఐద్వా నాయకురాలు ఐఎన్‌ సుబ్బమ్మ, జెవివి సమతా కమిటీ సభ్యులు కామేశ్వరమ్మ, డ్రాయింగ్‌ మాస్టర్‌ శ్రీనివాసులు, జనవిజ్ఞాన వేదిక జిల్లా కల్చరల్‌ కమిటీ కన్వీనర్‌, క్రాఫ్ట్‌ మాస్టర్‌ రంగనాయకులు పాల్గొన్నారు.కథల వల్ల సరైన మార్గంలో జీవిత ప్రయాణం.. జిల్లా గ్రంథాలయ సంస్థ ప్రతి సంవత్సరమూ నిర్వహిస్తున్నట్లుగా ఈ సంవత్సరం కూడా వేసవి వేసవినోద కార్యక్రమాన్ని ప్రారంభించింది. శనివారం జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు ఏ.డి. దేవదత్తం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు ”పాడుదమా స్వేచ్ఛా గీతం” ”విజ్ఞానంతోనే వికసించు జగత్తు ”అనే పాటలను ఆలపించారు. ఆటలు, పాటలు, కథల ద్వారా కలిగే ప్రయోజనం గురించి విద్యార్థులతో చర్చించారు. విద్యార్థులు చురుగ్గా పాల్గొన్నారు. అదేవిధంగా సెల్ఫోన్‌ అతిగా వాడడం వలన జరిగే అనర్థాలను గురించి తెలియజేశారు. ఈ సెల్‌ ఫోన్‌ అతిగా వాడడం వల్ల కలిగే అనర్థాలగురించి విద్యార్థులే చక్కగా వివరించారు. ఆటలు సెల్‌ ఫోన్లులో కాకుండా గ్రౌండ్‌లో ఆడుకోవడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ సెక్రటరీ అమీరుద్దీన్‌ లైబ్రరీయన్‌ బాబ్జి, సుబ్రమణ్యం, సిబ్బంది సుబ్బమ్మ, రమణ పాల్గొన్నారు.

➡️