మహిళలను రోడ్డు పైకి లాగడం శోచనీయం

Dec 18,2023 15:41 #Kadapa
kadapa anganwadai strike continue 7th day tdp

టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పార్థసారథిరెడ్డి
ప్రజాశక్తి – వేంపల్లె : అంగన్వాడీ మహిళాలను వైకాపా ప్రభుత్వం రోడ్డుపైకి లాగడం శోచనీయమని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారథిరెడ్డి, ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మహమ్మద్ షబ్బీర్ లు అన్నారు. సమస్యలను పరిష్కరించడంతో పాటు జీతాలు పెంచాలని గత 7 రోజుల నుండి అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు సోమవారం టిడిపి నాయకులు సంఘీభావం తెలిపారు. విన్నూతంగా చెవిలో పూలు పెట్టుకొని నిరసన చేస్తున్న అంగన్వాడీ మహిళాలతో కలిసి టీడీపీ నాయకులు కూడ చెవిలో పూలు పెట్టుకుని వైకాపా ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పాదయాత్రలో జగన్ రెడ్డి ఇచ్చిన హమీని అమలు చేయాలని అంగన్వాడీలు కోరుతున్నట్లు చెప్పారు. పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాన్ని సిఎం జగన్ రెడ్డి నేరవేర్చాలని కోరారు. జగనన్న వచ్చి తమ సమస్యలు పరిష్కారం చేస్తాడనే ఆశతో వైకాపా ప్రభుత్వానికి ఓట్లు వేయడం జరిగిందని అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీలను మోసం చేయడం దుర్మార్గమని చెప్పారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పుటి నుండి ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు. ధరలకు అనుగుణంగా అంగన్వాడీలకు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం లాగ ఎపిలో కూడ అంగన్వాడీ ఉద్యోగులకు జీతాలు పెంచి సమస్యలు పరిష్కరించాలని కోరారు. అంగన్వాడీలు చేపట్టే సమ్మెకు టిడిపి సంపూర్ణంగా మద్దతు ఉంటుందని తెలిపారు. అంగన్వాడిల నిరసన కార్యక్రమాలకు టిడిపి మద్దతు ఉంటుందని చెప్పారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం సమ్మె చేస్తున్నా అంగన్వాడిలకు టిడిపి ఆధ్వర్యంలో బిస్కెట్ లు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో టిడిపి నాయకులు అల్లాబకష్, ఆర్ వి రమేష్, మహబూబ్ షరీఫ్, ఇలియాస్, వెంకటయ్య, జిలాన్, తిప్పారెడ్డి, లాడెన్ బాష, రమణ, సిఐటియు నాయకులు లలితా దేవి, సావిత్రి, ఎఐటియుసి నాయకులు సరస్వతి, శైలజాతో పాటు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️