పాపాఘ్ని నదిలో జల దీక్ష చేసిన అంగన్వాడీలు

Dec 21,2023 13:52 #Kadapa
kadapa anganwadi workers strike 10th day b

జీతాలు పెంచే వరకు ఉద్యమం ఆగదు

ప్రజాశక్తి – వేంపల్లె : అంగన్వాడీలకు జీతాలు పెంచే వరకు ఉద్యమం ఆగదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గుజ్జల ఈశ్వరయ్య పేర్కొన్నారు. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన సమ్మె గురువారం నాటికి 10వ రోజు చేరింది. దీంతో విన్నూతంగా అంగన్వాడి మహిళాలు అందరూ వేంపల్లెలోని పాపాఘ్ని నదిలోకి వెళ్లి జల దీక్ష చేసి నిరసన వ్యక్తం చేశారు. అలాగే వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ జల దీక్షకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గుజ్జల ఈశ్వరయ్య, అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి మంజులా సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా గుజ్జల ఈశ్వరయ్య మాట్లాడుతూ 25నుండి అంగన్వాడీల ఉద్యమం రూప రేఖలు మారుతాయాని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 1 లక్షల 6 వేలు మంది అంగన్వాడీ మహిళలు వివిధ రూపల్లో సమ్మె చేస్తున్నట్లు చెప్పారు. 54 వేలు ప్రాజెక్టుల నుండి సమ్మె చేస్తున్న మహిళాల పట్ల సిఎం జగన్ కు కనికరం లేక పోవడం దుర్మార్గం అన్నారు. అంగన్వాడీ జీవితాల్లో వెలుగును నింపుతామని హమీ ఇచ్చి ప్రస్తుతం వారి జీవితాల్లో చీకటిని నింపడం శోచనీయం అన్నారు. జగన్ పుట్టిన రోజు రోజునైనా అంగన్వాడీలకు జీతాలు పెంచాలని కోరారు. ఈ జల దీక్ష కార్యక్రమంలో ఏరియా సహయ కార్యదర్శి బ్రహ్మం, ఏరియా కార్యదర్శి వెంకట రాములు, సిఐటియు నాయకురాలు లలితామ్మ, సావిత్రి, ఎఐటియుసి నాయకులు సరస్వతి, శైలజాలతో పాటు అంగన్వాడీ మహిళాలు పాల్గొన్నారు.

➡️