‘పల్లెపల్లెకు కాకర్ల’

Apr 5,2024 22:28
ఫొటో : మాట్లాడుతున్న కాకర్ల సురేష్‌

ఫొటో : మాట్లాడుతున్న కాకర్ల సురేష్‌
‘పల్లెపల్లెకు కాకర్ల’
ప్రజాశక్తి-సీతారామపురం : అభివృద్ధి, సంక్షేమాలు అనేవి తెలుగుదేశం పార్టీకి రెండు కళ్ళు లాంటివి అని ఉదయగిరి ఎంఎల్‌ఎ కూటమి అభ్యర్థి కాకర్ల సురేష్‌ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని గుండుపల్లి, పప్పులేటిపల్లి పంచాయతీల్లో పల్లెపల్లెకు కాకర్ల కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి సూపర్‌ సిక్స్‌ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 20యేళ్లుగా ఇతర దేశాలకు వెళ్లి వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా స్థిరపడి సొంత ఊరికి సేవ చేయాలని దృక్పథంతో గత మూడు సంవత్సరాల క్రితం ఉదయగిరి ప్రాంతానికి వచ్చి కాకర్ల ట్రస్ట్‌ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. మిగిలిన జీవితం మొత్తం ఉదయగిరి ప్రాంతానికి సేవ చేస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు. టిడిపి నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డికి ఎంఎల్‌ఎ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాకర్ల సురేష్‌కు రాజకీయాలు కేవలం సేవ చేయడానికి మాత్రమేనన్నారు. నెల్లూరు ఎంపి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి ‘విపిఆర్‌’ ఫౌండేషన్‌ ద్వారా అందిస్తున్న సేవలు అసామాన్యమన్నారు. విపిఆర్‌ అమృత ధారా, విపిఆర్‌ విద్య, విపిఆర్‌ వైద్యం, విపిఆర్‌ వాత్సల్యం వంటి అనేక సేవల ద్వారా పేద ప్రజలను ఆదుకుంటున్నారని తెలియజేశారు. అదేవిధంగా కాకర్ల ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న తనకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి ఉదయగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15వేల చొప్పున నగదు జమ చేస్తామన్నారు. ఆడబిడ్డ నిధి నుంచి 18యేళ్లు నిండిన ప్రతి స్త్రీకి నెలకు రూ.1500 అందిస్తామన్నారు. దీపం పేరుతో ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్‌లను అందిస్తామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు. ప్రతి రైతుకు యేటా రూ.20వేల ఆర్థికసాయం చేస్తామన్నారు. ఇంటింటికి మంచినీరు పథకం కింద ప్రతి ఇంటికి రక్షిత తాగునీటి కొళాయి కనెక్షన్లను అందించి, సుమారు 20లక్షల మంది యువతకు ఉపాధిని కల్పించి, నిరుద్యోగులకు యువగళం నిధి నుంచి నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతిని అందజేస్తామన్నారు. పెన్షన్‌ రూ.4వేలు అందించి ఆదుకుంటామన్నారు. ఇలా అన్ని వర్గాల వారిని తెలుగుదేశం ప్రభుత్వం ఆదుకుంటుందని, కావున చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేసుకొని సంక్షేమం అభివృద్ధి వైపుగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మండల టిడిపి కన్వీనర్‌ కప్ప ప్రభాకర్‌ రాజు, మాజీ జెడ్‌పిటిసి కలివెల జ్యోతి, మాజీ ఎంపిపిలు కల్లూరి జనార్థన్‌ రెడ్డి, నేలటూరి అబ్రహం, మండల టిడిపి నాయకులు చింతల శ్రీనివాసులు, గాజులపల్లి చంద్రారెడ్డి, సర్పంచులు కొడవటికంటి భాగ్యమ్మ, కల్లూరి వెంకటరెడ్డి, ముత్తూరు వెంకటసుబ్బయ్య, ఆదయ్య, జనసేన నాయకులు భోగి నేని కాశీరావు, ఆలూరు రవీంద్ర, పాలిశెట్టి శ్రీనివాసులు, టిడిపి నాయకులు పిడుగు రమేష్‌, కలివేల బాలస్వామి, వెంగళశెట్టి వెంకటేశ్వర్లు, జాషువా వెంకమ రాజు, కరుణాకర్‌, ఆలూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

➡️