అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలి

Feb 19,2024 22:29
స్పందన కార్యక్రమంలో

ప్రజాశక్తి – కాకినాడ

స్పందన కార్యక్రమంలో వస్తున్న అర్జీలకు శాశ్వతమైన పరిష్కారం చూపాలని కలెక్టర్‌ డాక్టర్‌ కృతికాశుక్లా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన స్పందనకు జిల్లా నలుమూలల నుంచి పెద్దఎత్తున ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌కు వినతిపత్రాలను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ప్రజల నుంచి వచ్చిన సమస్య లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ స్పందనకు వస్తున్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. స్పందనకు వస్తున్న ప్రతీ వినతిని క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం ఇవ్వాలన్నారు. ముఖ్యంగా ఒకే అంశంపై మళ్ళీ మళ్ళీ అర్జీలు నమోదు కాకుండా అర్జీలపై అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ డి.తిప్పేనాయక్‌, హౌసింగ్‌ పీడీ ఎన్‌వివి.సత్య నారాయణ, డిఆర్‌డిఎ పీడీ కె.శ్రీరమణి, సిపిఒ పి.త్రీనాథ్‌, డిఎల్‌డిఒ పి.నారా యణమూర్తి, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్‌ వివిధ సెక్షన్ల అధికారులు పాల్గొన్నారు.

➡️