ఆదిత్యలో ఘనంగా గ్రాండ్‌ స్కిల్‌ ఎక్స్‌పో

Mar 27,2024 23:04
స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాలలో

ప్రజాశక్తి – కాకినాడ

స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాలలో గ్రాండ్‌ స్కిల్‌ ఎక్స్పో – 2024 ఫెస్ట్‌ ఘనంగా జరిగింది. బుధవారం జరిగిన ఈ కార్యక్రమానికి అకడమిక్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బిఇవిఎల్‌. నాయుడు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల మానసిక, శారీరక దారు ఢ్యానికి క్రీడలు మరియు సాంస్కృతిక కళలు ఉపయోగపడతాయని అన్నా రు. ఆదిత్య డిగ్రీ కళాశాలలో ప్రతినెల స్కిల్‌ ఎక్స్పో పేరిట విద్యార్థులలో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు పోటీలు నిర్వహిస్తామని, ప్రతినెల నిర్వ హించిన కార్యక్రమాల తర్వాత ఆయా అంశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గ్రాండ్‌ స్కిల్‌ ఎక్స్‌ పో పేరిట ఒక ఫెస్ట్‌ నిర్వహించి విజేతలకు ప్రశంసా పత్రాలను జ్ఞాపికలను అందిస్తామని అన్నారు.ఈ కారక్రమంలో పాల్గొన్న ఇస్రో మాజీ సైంటిస్ట్‌ యాళ్ల శివప్రసాద్‌ మాట్లాడుతూ విద్యార్థులు చదువులోనే కాకుండా అన్ని రంగాలలోనూ రాణించాలని అన్నారు. అనంతరం వివిధ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను, జ్ఞాపికలను అందించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అధ్యాపక బృందాన్ని ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ నల్లమిల్లి శేషారెడ్డి, డిగ్రీ కళాశాలల సెక్రటరీ డాక్టర్‌ నల్లమిల్లి సుగుణ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ సత్యనారాయణ, క్యాంపస్‌ ఇన్‌ఛార్జ్‌ మూర్తి, ఆంగ్ల విభాగాధిపతి ఎల్‌.వర ప్రసాద్‌, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️