ఒడిగోస్‌ సిఇఒ వినోద్‌కు ఎక్స్లెన్స్‌ అవార్డు

Feb 26,2024 23:06
జెఎస్‌ఎంఆర్‌వి ఒడి గోస్‌

ప్రజాశక్తి – కాకినాడ

జెఎస్‌ఎంఆర్‌వి ఒడి గోస్‌ టెక్నాలజీస్‌ మేనేజింగ్‌ పార్టనర్‌ వార వినోద్‌కు హైదరా బాద్‌ ఎక్స్లెన్స్‌ అవార్డు లభించింది. స్థానిక రమణయ్య పేటలోని 3 ఎపిఎస్‌పి బెటాలియన్‌ వద్ద గల జెఎస్‌ఎంఆర్‌వి ఒడిగోస్‌ కార్యా లయంలో సోమవారం అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా వార వినోద్‌ మాట్లాడుతూ ఆదివారం మనోహర్‌ హోటల్‌లో జరిగిన హైదరాబాద్‌ ఎక్స్లెన్స్‌ అవార్డ్స్‌ ప్రధానోత్సవంలో టాలీవుడ్‌ హీరోయిన్‌ ప్రణీత సుభాష్‌ చేతుల మీదుగా బెస్ట్‌ ఐటి ట్రైనింగ్‌ ఇన్స్టిట్యూట్‌ ( సాఫ్ట్వేర్‌ అండ్‌ వెబ్‌ డిజైన్‌) కేటగిరీలో హైదరాబాద్‌ ఎక్స్లెన్స్‌ అవార్డు అందుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా సివైఎఫ్‌ ఇంటర్నేషనల్‌ డైరెక్టర్‌ మూర్తిరాజు మాట్లాడుతూ అంత్యంత విలువలతో కూడిన శిక్షణ ఇవ్వడం వల్ల ఈ అవార్డు వచ్చిందని అన్నారు. పోస్టల్‌ యూనియన్‌ నాయకలు వార సత్యనారాయణ మాట్లాడుతూ జెఎస్‌ఎంఆర్‌వి ఒడిగోస్‌ చేస్తున్న సేవలు అబినం దనీయమని కొనియాడారు. అవార్డు గెలుచుకున్న జెఎస్‌ఎంఆర్‌వి ఒడిగోస్‌ను రాష్ట్ర ఎస్‌సి కార్పొరేషన్‌ చైర్మన్‌ జంగా గగారిన్‌, వాసిరెడ్డి ఏసుదాస్‌, డాక్టర్‌ పివివి.సత్యనారాయణ, ధర్మరావు, రేఖారెడ్డి, బాలాజీ, జాషువు గిరి, మచ్చ బుజ్జి, జిం విల్సన్‌, మేరీ జ్యోతి తదితరులు అభినందించారు.

➡️