కార్పొరేషన్‌ సొమ్మును దోచుకుంటున్న ఎంఎల్‌ఎ

Jan 28,2024 00:25
ప్రజల కష్టార్జీతమైన

ప్రజాశక్తి – కాకినాడ

ప్రజల కష్టార్జీతమైన కార్పొరేషన్‌ సొమ్మును వక్ర మార్గాల్లో ఎంఎల్‌ఎ ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి దోచుకుంటున్నారని మాజీ ఎంఎల్‌ఎ వనమాడి కొండ బాబు ఆరోపించారు. స్థానికి టిడిపి కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరపాలక సంస్థ పరిధిలో స్థానిక దుమ్ములపేట సమీప ప్రాంతంలోని సర్వే నెంబర్‌. 1986/3డి2, 1989/1ఎ, 4ఎ గల 4 ఎకరాల 67 సెంట్ల ప్రయివేటు స్థలాలకు కాకినాడ నగరపాలక సంస్థ నుంచి గజం రూ.28 వేలు చొప్పున 1:4గా సుమారు రూ.251 కోట్ల విలువ చేసే టిడిఆర్‌ బాండ్లను మం జూరు చేయించి ఎంఎల్‌ఎ దోచుకున్నారని విమర్శం చారు. ఇదే ప్రాంతాన్ని ఆనుకుని కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో అనేక ప్రభుత్వ భూములు, పోర్టు భూము లు ఉన్నాయని, ద్వారంపూడి తనకి లబ్ధి చేకూరేలా ప్రయివేట్‌ భూములను ఎంపిక చేసి వాటికి గుట్టు చప్పు డు కాకుండా టిడిఆర్‌ బాండ్లు మంజూరి చేయిం చాడని, వక్రమార్గాల్లో కార్పొరేషన్‌ సొమ్మును దోచుకుం టున్న ద్వారంపూడికి సహకరించలేక గత కమిషనర్లు బదిలీలపై వెళ్లిపోవడం జరిగిందని తెలిపారు. ప్రస్తుత కమిషనర్‌ నాగ నరసింహారావు ద్వారంపూడి దోపిడికి సహకరిస్తూ కార్పొరేషన్‌ సొమ్ములను దుర్వినియోగం చేస్తూ కార్పొ రేషన్‌ ఖజానాను గుల్ల చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఈ విధంగానే కార్పొరేషన్‌ పరిధిలో గల సురేష్‌ నగర్‌ ప్రభుత్వ భూములపై ప్రయివేట్‌ వ్యక్తులకు టిడిఆర్‌ బాండ్లు మంజూరు చేసి కార్పొరేషన్‌ సొమ్మును దుర్ము నియోగం చేశారని ఆరోపిం చారు. కార్పొరేషన్‌ సొమ్ము దుర్వి నియోగంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి మంజూరు చేసిన టిడిఆర్‌ బాండ్లను రద్దు చేసి ప్రభుత్వ ఖజానాను కాపాడాలని కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌కు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం జరిగిందని కొండబాబు తెలి పారు. ఈ సమావేశంలో టిడిపి నగర అధ్యక్షులు మల్లి పూడి వీరు, పలివెల రవి, తుమ్మల రమేష్‌, గదుల సాయిబాబా, సీకోటి అప్పలకొండ, ఒమ్మి బాలాజీ పాల్గొన్నారు.

➡️