కార్మికుని కుటుంబానికి న్యాయం చేయాలి

Apr 1,2024 23:27
పని ప్రాంతంలో విద్యుత్‌

ప్రజాశక్తి – పెద్దాపురం

పని ప్రాంతంలో విద్యుత్‌ షాక్‌కు గురై మరణించిన భవన నిర్మాణ కార్మికుడు వీర నాగేశ్వ రరావు కుటుంబానికి న్యాయం చేయాలని భవన నిర్మా ణ కార్మిక సంఘం డిమాండ్‌ చేసింది. సోమవారం మండలంలోని కట్టమూరు సచివాల యం వద్ద భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా మృతి చెందిన కార్మికుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు పిఎస్‌.నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్‌ మాట్లాడుతూ మార్చి 23వ తేదీన బిల్డింగు పిల్లర్స్‌కు కాంక్రీట్‌ వేస్తుండగా ఈ ప్రమాదం జరిగిం దన్నారు. కట్టమూరు గ్రామంలో రూ.50 లక్షలు, రూ.కోటి దాటి భవనాలు నిర్మించేవారు బిల్డింగ్‌ ప్లాన్‌, లేబర్‌ సెస్సు కట్టకుండానే పంచాయతీ కార్యదర్శి అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల పంచాయితీకి రావలసిన ఆదాయం, భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుకు రావలసిన ఆదాయం కోల్పో తున్నారని అన్నారు. పంచాయతీ కార్యదర్శిని సస్పెం డ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమానికి ముందు స్థానిక మరిడమ్మ గుడి చెరువు గట్టు వీధిలోని తాపీ వర్కర్స్‌ భవనంలో గదుల నూకరాజు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్‌ ప్రధాన కార్యదర్శి బత్తుల మురళి, గడపా శివబాబు, నీలంశెట్టి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

➡️