గుమ్మ రేగులలో వరుపుల పర్యటన

Feb 15,2024 17:25
మండలంలోని గుమ్మరేగుల

ప్రజాశక్తి – రౌతులపూడి

మండలంలోని గుమ్మరేగుల గ్రామంలో స్థానిక సర్పంచ్‌ రాపర్తి రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జ్‌ వరుపుల సుబ్బారావు గరువారం పర్యటించారు. తొలుతగా రౌతులపూడి శివాలయం నుంచి గుమ్మరేగుల వరకూ 3 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అనంతరం గ్రామంలో ఇంటింటికీ తిరిగి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్‌పిటిసి గొల్లు లక్ష్మణమూర్తి., శంఖవరం ఎంపిపి పర్వత రాజుబాబు, వైస్‌ ఎంపిపి తిరుమల రాయలు, ఎఎంసి చైర్మన్‌ భాస్కర్‌ బాబు, వైసిపి నాయకులు వాసిరెడ్డి జమీలు, పులి మధు, తదితరులు పాల్గొన్నారు.

➡️