చలో ఢిల్లీకి మద్దతుగా ధర్నా

Mar 15,2024 00:01
సంయుక్త కిసాన్‌ మోర్చా

ప్రజాశక్తి – కాకినాడ

సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) పిలుపుమేరకు మార్చి 14న రైతాంగ చలో ఢిల్లికి మద్దతుగా ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. గురువారం రైతు, కార్మిక, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక, రైతు కూలీ సంఘాల ఆధ్వర్యంలో ఇంద్రపాలెం లాకుల వద్ద అంబెడ్కర్‌ విగ్రహం నుంచి కలెక్టరేట్‌ వరకూ ర్యాలీ నిర్వహించి ధర్నా జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లు రాజబాబు, ఉభయ తెలుగు రాష్ట్రాల ఐఎన్‌టియుసి ఆర్గనైజింగ్‌ సెక్రటరీ తాళ్లూరి రాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్య దర్శి కొప్పు ఆదినారాయణ, ఆంధ్రప్రదేశ్‌ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు, ఎఐటి యుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్‌, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టేకు మూడి ఈశ్వరరావు మాట్లాడారు. ప్రధాని మోడీ ఇచ్చిన హామీ, స్వామినాథన్‌ ప్రతిపాదనల మేరకు రైతుల పంటలకు కనీసం మద్దతు ధర చట్టం చేయా లని డిమాండ్‌ చేశారు. ఏ రంగంలో పనిచేసే కార్మి కుడికైనా కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, ఉపాధిహామీ పథకాన్ని రెండు వందల రోజులకు పెంచి రోజుకు 600 వేతనం చెల్లించా లన్నారు. పట్టణాలకు విస్తరింప చేయాలని, కౌలు రైతులకు భూ యజమానితో సంబంధం లేకుండా పంట రుణాలు, వంట నష్టం, గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని, కేరళ ప్రభుత్వం తరహా రైతుల పంటలకు రుణ ఉపశమన చట్టం చేయాలని, రైతాంగ ఉద్యమం సందర్భంగా చనిపోయిన రైతుల కుటుం బాలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బిజెపి మోడీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువస్తే రైతుల పంటలకు కనీస మద్దతు ధర చెల్లిస్తామని 2014 ముందు మోడీ ఇచ్చిన హామీని గుర్తు చేశారు. వ్యవసాయ సంక్షోభ నివారణకు తన జీవితాన్ని అంకితం చేసిన ఎంఎస్‌ స్వామినాథన్‌ చేసిన ప్రతిపాదనలను పరిగనణలోకి తీసుకోకుండా ఆయనకు భారతరత్న బిరుదు ఇస్తే ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. గత 10 ఏళ్ల కాలంలో 1 లక్షా 60 వేల మంది రైతులు వ్యవసాయం గిట్టుబాటుకాక ఆత్మహత్యలకు పాల్ప డ్డారని తెలిపారు. మోడీ అవలంభిస్తున్న ప్రజా, కార్మిక, రైతాంగ విధానాలను అడ్డుకోవాల్సిన వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు మోడీ భజనలో మునిగి తేలుతున్నా యని అన్నారు. కేంద్రంలోని మోడీని, రాష్ట్రంలో మోడీ విధానాలను బలపరుస్తున్న పార్టీల ను రాబోయే ఎన్నికల్లో ఓడించాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దువ్వ శేషబాబ్జి, చెక్కల రాజ్‌ కుమార్‌, జిల్లా కోశాధి కారి మలకా రమణ, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, సామాజిక ఉద్యమ కారులు ఐయితాబత్తుల రామేశ్వర రావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగ సూరిబాబు, సిపిఎం జిల్లా కన్వీనర్‌ మోర్తా రాజశేఖర్‌, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కెఎస్‌ శ్రీనివాస్‌, ఎఐఎఫ్‌టియు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కుంచె అంజిబాబు, రైతు కూలి సంఘం నాయకులు వల్లూరి సత్తిబాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి బోద కొండ, వ్యవ సాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కేసవరపు అప్పలరాజు, పోర్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఒరిమి రమణ, కాంట్రాక్టు లేబర్‌ యూనియన్‌ సాయి, ఐఎన్‌టియుసి నాయకులు సాయిరెడ్డి, ఎఐసిసిటియు జిల్లా నాయకులు నరసరాజు పాల్గొన్నారు.

➡️