నెట్‌బాల్‌ టోర్నీలో ఆదిత్య విద్యార్థి ప్రతిభ

Mar 8,2024 22:14
నెట్‌బాల్‌ టోర్నీలో ఆదిత్య విద్యార్థి ప్రతిభ

ప్రజాశక్తి-గండేపల్లి సూరంపాలెంలోని ఆదిత్య కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌, టెక్నాలజీ కళాశాలకు చెందిన విద్యార్థి ఎస్‌.రవికుమార్‌ నెట్‌బాల్‌ టోర్నమెంట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఆలిండియా ఇంటర్‌ యూనివర్సిటీ టీమ్‌కు ఎంపికైనట్టు కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ డోలా సంజరు తెలిపారు. ఇటీవల ఏలూరు సర్‌ సిఆర్‌.రెడ్డి కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో నిర్వహించిన జెఎన్‌టియుకె సెంట్రల్‌ జోన్‌ పరిధిలో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ చూపి ఎపంకైనట్టు తెలిపారు. ఈ నెల 12 నుంచి 15 వరకు శ్రీ సిద్ధార్థ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కర్ణాటక యూనివర్సిటీలో నిర్వహించే ఆఆండియా ఇంటర్‌ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించినట్టు ప్రిన్సిపల్‌ తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ మాట్లాడుతూ ఆదిత్య విద్యార్థులు చదువులోనే కాక క్రీడల్లో కూడా ప్రతిభ చూపడం ఎంతో సంతోషదాయకం అన్నారు. మిగిలిన విద్యార్థులు కూడా చదువుతో పాటు ఆసక్తి గల క్రీడల్లో రాణించాలని సూచించారు. కళాశాల పరిపాలనాధికారి పి.వేణుగోపాల్‌ మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల శారీరక దఢత్వానికి కాకుండా మానసిక దఢత్వానికి కూడా ఎంతో దోహదం చేస్తాయని తెలిపారు. విద్యార్థికి కళాశాల సిబ్బంది, ఇతర విద్యార్థులు అభినందనలు తెలిపారు. కళాశాల క్రీడా ఉపాధ్యాయుడు బెహర ఆదిత్య, గంగాధర్‌కు అభినందనలు తెలిపారు.

➡️