ప్రతి ఒక్కరినీ స్వాగతించాలి

Mar 12,2024 23:40
పార్టీ పట్ల ఆకర్షితులైన ప్రతీ

ప్రజాశక్తి – జగ్గంపేట

పార్టీ పట్ల ఆకర్షితులైన ప్రతీ ఒక్కరికీ స్వాగతం పలకాలని టిడిపి జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్‌ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో చేరేందుకు ఆసక్తితో ఉన్న వారిని గుర్తించి ఆహ్వానించాలని, పార్టీలో చేరిన వారికి తగిన గుర్తింపును ఇస్తామని అన్నారు. రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ విజయానికి ప్రతీ ఒక్క కార్యకర్త, నాయకుడు కృషి చేయాలని అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత తన సొంత అజెండా ద్వారా ఇల్లు లేని పేదలను గుర్తించి జి ప్లస్‌ టు ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. అలాగే ఆడపిల్లకు వివాహం జరిగితే రూ.20 వేలు ఆర్థికసాయాన్ని అందిస్తామని అన్నారు. టిడిపి నియోజకవర్గ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ యువత యువ గళం పేరుతో బస్సు యాత్ర ద్వారా గ్రామాల్లో పర్యటిస్తారని, మహిళా శక్తి కార్యక్రమంలో తన కోడలు లక్ష్మీదేవి, కుమార్తె సునీత కలిసి గ్రామంలో ఇంటింటికి పర్యటిస్తారని తెలిపారు. నాలుగు అంశాల ప్రమాణంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఈనెల 17న చిలకలూరిపేటలో జరిగే టిడిపి, బిజెపి, జనసేన ఉమ్మడి సభలో నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికల శంఖారావం పూరిస్తారని, ఆ సభకు జగ్గంపేట నియోజకవర్గం నుంచి 4 వేల మందికిపైగా తరలివెల్లేలా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

➡️