బాధ్యతలు చేపట్టిన జెసి రామ్‌సుందర్‌ రెడ్డి

Mar 13,2024 23:28
పశ్చిమ గోదావరి జిల్లా

 ప్రజాశక్తి – కాకినాడ

పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కాకినాడ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా బదిలీపై వచ్చిన ఎన్‌.రామ్‌సుందర్‌ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ డాక్టర్‌ కృతికాశుక్లాను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రాధాన్యత అంశాలపై ఇరువురు చర్చించారు. నూతన జేసీగా బాధ్యతలు స్వీకరించిన రామ్‌ సుందర్‌ రెడ్డిని డిఆర్‌ఒ డి.తిప్పేనాయక్‌, కమిషనర్‌ జె.వెంకట రావు, కలెక్టరేట్‌ ఎఒ జిఎస్‌్‌ఎస్‌.శ్రీనివాసు, పౌరసరఫరాల సంస్థ, సర్వే, హౌసింగ్‌, ఇతర శాఖల అధికారులు, కలెక్టరేట్‌ వివిధ విభాగాల అధిపతులు పలువురు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌ లోని వివిధ విభాగాలను డిఆర్‌ఒతో కలిసి పరిశీలిం చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నతా ధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. 

➡️